మనలో చాలా మంది వినియోగించే స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అదీ ప్రీమియం ఫీచర్లతో ఒక్క రూపాయికే వస్తే.. సూపర్ ఆఫర్ అనుకుంటున్నారు కదా.. ఇలాంటి ఆఫరే సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ (ట్విట్టర్) లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అనేక మంది వినియోగదారులు రూ.1కే డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పొందినట్లు పోస్ట్‌లు చేస్తున్నారు. దానికి సంబంధించిన పేమెంట్ స్క్రీన్‌షాట్లు కూడా షేర్ చేయడంతో ఈ ఆఫర్‌పై ఉత్సుకత మరింత పెరిగింది.
అయితే, జియో లేదా డిస్నీ+ హాట్‌స్టార్ మాత్రం ఇప్పటివరకు ఈ ఆఫర్‌పై అధికారిక ప్రకటన చేయలేదు. సాధారణంగా జియో ఇలాంటి ఆఫర్లు పరిమితంగా ఎంపిక చేసిన కొంత కస్టమర్లకు మాత్రమే ఇస్తుంటుంది. ఇది కూడా అలాంటి పరిమిత ట్రయల్ లేదా అంతర్గత టెస్టింగ్ దశలో భాగం కావచ్చని అంచనా.
ఏముంది ప్లాన్‌లో?
ఈ ఆఫర్‌ను పొందిన వినియోగదారుల చెబుతున్నదాని ప్రకారం.. జియోస్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్లో ఉన్న అన్ని ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, స్పోర్ట్స్, షోలను ప్రకటనలు లేకుండా చూడొచ్చు. డాల్బీ విజన్ , డాల్బీ అట్మోస్ 4కే నాణ్యతతో వీడియోలు ఏకకాలంలో నాలుగు డివైజ్‌లలో వరకు చూసే అవకాశం. మొబైల్, టీవీ, టాబ్లెట్, ల్యాప్ టాప్లలో సబ్స్క్రిప్షన్ను పంచుకునే అవకాశం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నట్లు కనిపిస్తోంది.
కొన్ని స్క్రీన్‌షాట్ల ప్రకారం.. 1 రూపాయికి 3 నెలల సబ్‌స్క్రిప్షన్ అని ఉండగా మరొకొన్నివాటిల్లో వార్షిక సబ్‌స్క్రిప్షన్గా కూడా ఉంది. అయితే, ట్రయల్ కాలం 30 రోజులు మాత్రమే ఉండవచ్చు. ఆ తర్వాత ఆటోమేటిక్ రిన్యూవల్ సమయంలో పూర్తి చార్జీలు వర్తించవచ్చు.
ఈ ఆఫర్ జియో సిమ్ వినియోగదారులు మాత్రమే కాకుండా కొంతమంది నాన్-జియో యూజర్లు కూడా వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది యూజర్లు రూ.1కే ఒక సంవత్సరం ప్రీమియం ప్లాన్ యాక్టివేట్ అయినట్లు చెబుతున్నారు. ఇది యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే కనిపించే ప్రమోషన్ కావచ్చని భావిస్తున్నారు.


