ఐవోసీ పెట్రోల్‌ బంకులకు జియో సర్వీసులు | Jio Ioc Sites With Sd-wan Managed Service Solution | Sakshi
Sakshi News home page

ఐవోసీ పెట్రోల్‌ బంకులకు జియో సర్వీసులు

Dec 23 2022 10:31 AM | Updated on Dec 23 2022 10:32 AM

Jio Ioc Sites With Sd-wan Managed Service Solution - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) తమ పెట్రోల్‌ బంకుల అనుసంధానం కోసం రిలయన్స్‌ జియో మేనేజ్డ్‌ నెట్‌వర్క్‌ సర్వీసులను వినియోగించుకోనుంది.

వచ్చే అయిదేళ్లలో 7,200 రిటైల్‌ అవుట్‌లెట్స్‌లో జియో ఇన్ఫోకామ్‌లో భాగమైన జియో బిజినెస్‌ సంస్థ తమ ఎస్‌డీ–డబ్ల్యూఏఎన్‌ (సాఫ్ట్‌వేర్‌ డిఫైన్డ్‌ వైడ్‌ ఏరియా నెట్‌వర్క్‌)ను ఏర్పాటు చేయనుంది. 

ఐవోసీకి ఉన్న మొత్తం బంకుల్లో ఇది అయిదో వంతు. పేమెంట్‌ ప్రాసెసింగ్, రోజువారీ ధరల అప్‌డేషన్, రిమోట్‌ డెస్క్‌టాప్‌ ప్రోటోకాల్‌ (ఆర్‌డీపీ)సాఫ్ట్‌వేర్, 24 గంటల పాటు సపోర్ట్‌ మొదలైనవి ఈ సర్వీసులో భాగంగా ఉంటాయని ఐవోసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే 2,000 పైచిలుకు రిటైల్‌ అవుట్‌లెట్స్‌ను ఎస్‌డీ–డబ్ల్యూఎన్‌ సెటప్‌లోకి చేర్చినట్లు రిలయన్స్‌ జియో హెడ్‌ (ఎంటర్‌ప్రైజ్‌) ప్రతీక్‌ తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement