జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..!

Jio Fiber Users Can Now Make Video Calls from TV Using Smartphone Camera - Sakshi

జియో తన కస్టమర్లకు తీపికబురును అందించింది. జియో ఫైబర్‌ వినియోగదారులు ఇప్పుడు ఏలాంటి వెబ్‌కెమెరా లేకుండా టీవీల్లో వీడియో కాలింగ్‌ చేసే​ సదుపాయాన్ని జియో తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. 'కెమెరా ఆన్ మొబైల్' అనే కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ టీవీల్లో వీడియో కాలింగ్‌ ఆప్షన్‌ను పొందవచ్చును. అందుకోసం జియోజాయిన్‌ అనే యాప్‌ను యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

గత కొన్ని నెలలుగా 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్‌ను జియో పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. జియోఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను వినియోగించుకునే  కస్టమర్లకు జియోఫైబర్‌వాయిస్‌తో వీడియోకాలింగ్‌ ఆప్షన్‌ను ఎనెబుల్‌ చేయవచ్చును. కస్టమర్లు తమ మొబైల్‌లోని జియోజాయిన్‌ యాప్‌ ద్వారా ల్యాండ్‌లైన్‌ నంబర్లకు కూడా వాయిస్‌కాల్స్‌ చేసుకోవచ్చును. 

మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా యూజర్లు తమ టీవీలో వీడియో కాల్ చేయడానికి ముందుగా పది అంకెల జియో ఫైబర్ నంబర్‌ను జియోజాయిన్‌ యాప్‌లో నమోదు చేయాలి. జియోఫైబర్‌ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, జియో జాయిన్‌  యాప్ సెట్టింగ్‌లలో 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్‌తో వీడియోకాల్స్‌ చేసుకోవచ్చును. స్పష్టమైన వీడియో కాలింగ్‌ సేవల కోసం జియోఫైబర్‌ మోడమ్‌ను 5GHz Wi-Fi బ్యాండ్‌కి మార్చాల్సి ఉంటుంది. 2.4GHz బ్యాండ్‌లో కూడా వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను పొందవచ్చును, కానీ వీడియో కాలింగ్‌లో కొంత అస్పష్టత ఉండవచ్చును.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top