Jio acquires Reliance Infratel for Rs 3,720 crore - Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ను కొనుగోలు చేసిన జియో!

Published Fri, Dec 23 2022 10:50 AM

Jio Acquires Reliance Infratel For Rs 3,720 Cr - Sakshi

ముంబై: రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌లో (ఆర్‌ఐటీఎల్‌) 100 శాతం వాటాలను రిలయన్స్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (ఆర్‌పీపీఎంఎస్‌ఎల్‌) దక్కించుకుంది. ఇందుకోసం రూ. 3,725 కోట్లు వెచ్చించింది. ఆర్‌పీపీఎంఎస్‌ఎల్‌ మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ విషయాలు వెల్లడించింది. 

వివరాల్లోకి వెళ్తే.. దివాలా చర్యలు ఎదుర్కొంటున్న రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ (ఆర్‌ఐటీఎల్‌) మొబైల్‌ టవర్, ఫైబర్‌ అసెట్స్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు టెలికం దిగ్గజం జియోలో భాగమైన ఆర్‌పీపీఎంఎస్‌ఎల్‌ 2019లో రూ. 3,720 కోట్లకు బిడ్‌ చేసింది. 

ఈ మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో డిపాజిట్‌ చేస్తామంటూ నవంబర్‌ 6న ప్రతిపాదించింది. దీనికి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదముద్ర వేయడంతో తాజాగా రూ. 3,720 కోట్లను ఎస్‌బీఐ ఎస్క్రో ఖాతాలో జమ చేసింది.

Advertisement
Advertisement