
ఎంటైన్ ఇండియాగా ఐవీ రిబ్రాండ్..
3,400 మందికి ఉపాధి
గ్లోబల్ స్పోర్ట్స్, గేమింగ్ లీడర్‌గా ఉన్న ఎంటైన్ సంస్థకు చెందిన టెక్నాలజీ విభాగం ఐవీ అధికారికంగా ఎంటైన్ ఇండియాగా రీబ్రాండ్ అయి హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. కొత్త హైదరాబాద్ క్యాంపస్ ఎంటైన్ అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారనుందని కంపెనీ పేర్కొంది.
ఈ సంస్థలో పని చేసేందుకు హైబ్రిడ్ రోల్స్‌లో 3,400 మంది హైస్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కు చోటు కల్పించేలా ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్(జీసీసీ)ఫెసిలిటీని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఎంటైన్ హైదరాబాద్ క్యాంపస్ ద్వారా గ్లోబల్ టెక్ సేవల్లో 85% పైగా సర్వీసులు అందించడానికి దీన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పింది. ఇందులో సేవలందించే అడ్వాన్స్‌డ్ డొమైన్‌లు కింది విధంగా ఉన్నాయి.
కృత్రిమ మేధ
ప్లాట్ ఫాం ఇంజినీరింగ్
రియల్ టైమ్ ట్రేడింగ్ సిస్టమ్స్
గ్లోబల్ సస్టెయినబిలిటీ లక్ష్యాలకు అనుగుణంగా హైదరాబాద్ క్యాంపస్‌లోని సదుపాయాలు..
స్మార్ట్ లైటింగ్ వ్యవస్థలు
ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లు
పర్యావరణహిత నిర్మాణ సామగ్రి
ఇదీ చదవండి: ట్రంప్ అదనపు డ్యూటీల ప్రస్తావన.. రూపాయి నేలచూపు
ఈ రీబ్రాండ్ వ్యూహాత్మక ప్రాముఖ్యతపై ఎంటైన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అంతిల్ అన్బగన్ మాట్లాడుతూ..‘ఎంటైన్ ఇండియా ద్వారా హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ సర్వీసులు అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్‌మెంట్ భవిష్యత్తును ఇక్కడి నుంచి శక్తివంతం చేయడం గర్వంగా ఉంది’ అన్నారు. ఎంటైన్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ సాటీ బెన్స్ మాట్లాడుతూ..‘తదుపరి తరం వినోద వేదికలను నిర్మించాలనే మా ఆశయానికి భారతదేశం కేంద్రబిందువుగా మారింది. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయడం ఆ దిశగా కంపెనీ వేసిన సాహసోపేతమైన ముందడుగు’ అని అన్నారు.