ఐటీసీ లాభం రూ. 2,567 కోట్లు | Sakshi
Sakshi News home page

ఐటీసీ లాభం రూ. 2,567 కోట్లు

Published Sat, Jul 25 2020 6:05 AM

ITC drops ahead of June quarter earnings - Sakshi

న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ.2,567 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.3,436 కోట్లతో పోల్చుకుంటే 25 శాతం తగ్గిపోయింది. ఎక్కువ మంది అనలిస్టుల అంచనాలకు అనుగుణంగానే కంపెనీ ఫలితాలు ఉండడం గమనార్హం. కన్సాలిడేటెడ్‌ ఆదాయం సైతం 17% తగ్గి రూ.12,658 కోట్లుగా నమోదైంది.

సిగరెట్ల అమ్మకాల రూపంలో వచ్చిన ఆదాయం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసుకుంటే రూ.6,142 కోట్ల నుంచి రూ.4,330 కోట్లకు పరిమితమైంది. ఎఫ్‌ఎంసీజీలో ఇతర విభాగాల పనితీరు మెరుగుపడింది. వీటి ఆదాయం మాత్రం రూ.3,068 కోట్ల నుంచి 3,379 కోట్లకు వృద్ధి చెందింది. హోటళ్ల ఆదాయం రూ.411 కోట్ల నుంచి 25 కోట్లకు తగ్గిపోగా.. అగ్రి వ్యాపారం ఆదాయం రూ.3,622 కోట్ల నుంచి రూ.3,765 కోట్లకు పెరిగింది. పేపర్‌బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్‌ ఆదాయం రూ.1,527 కోట్ల నుంచి రూ.1,026 కోట్లకు క్షీణించింది.  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement