రియల్టీ అంటే ఇళ్లు ఒక్కటే కాదు.. ఇవి కూడా

Investments Increased In Data Centre and Co living In Realty - Sakshi

ప్రత్యామ్నాయ రియల్టీలో పెట్టుబడుల జోరు 

డేటా సెంటర్, కో–లివింగ్‌ వంటి రంగాలకు డిమాండ్‌

వీటిలో పెరుగుతున్న ఇన్వెస్ట్‌మెంట్స్‌ 

గతేడాది 500 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు   

సాక్షి, హైదరాబాద్‌: డేటా సెంటర్, సీనియర్‌ లివింగ్, స్టూడెంట్‌ హౌసింగ్, కోలివింగ్‌ వంటి ప్రత్యామ్నాయ రియల్‌ ఎస్టేట్‌ విభాగాలలో పెట్టుబడులు వరద పారుతోంది. సాంకేతిక వినియోగం పెరగడంతో డేటా భద్రత చట్టం అనివార్యమైంది. దీంతో డేటా సెంటర్లలో పెట్టుబడులు పెరిగాయని కొలియర్స్‌ ఇండియా డైరెక్టర్‌ పీయూష్‌ గుప్తా తెలిపారు. గతేడాది దేశీయ ప్రత్యామ్నాయ రియల్టీలో 500 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని రిపోర్ట్‌ వెల్లడించింది. 2020తో పోలిస్తే ఇది 26 శాతం మేర వృద్ధి రేటని పేర్కొంది. 

అధిక నాణ్యత, సాంకేతికత, పాలన, కస్టమర్‌ సర్వీస్‌లలో గణనీయమైన మార్పులు వచ్చాయి. డేటా వేర్‌హౌస్‌లు, షేర్డ్‌ స్పేస్‌ (రెసిడెన్షియల్‌ లేదా కమర్షియల్‌), ప్రాప్‌టెక్‌ వంటి కొత్త వ్యాపారాలు ఊపందుకున్నాయి. మెరుగైన పాలన, గడువులోగా డెలివరీలు, నగదు లభ్యతతో నివాస సముదాయాల మార్కెట్లో సానుకూలత తిరిగొచ్చింది. నివాస రంగంలో 900 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది నాలుగేళ్లలో అత్యధికం. పెట్టుబడిలో అందుబాటు, మధ్యతరగతి గృహాలు 64 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ–కామర్స్‌ డిమాండ్‌తో గత ఐదేళ్లలో పారిశ్రామిక, గిడ్డంగుల విభాగంలో గరిష్ట స్థాయిలో 1.1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడిదారులు, డెవలపర్లు, ప్రాపర్టీ యజమానులు స్థిరమైన అభివృద్ధి వైపు దృష్టిసారించారు. దేశంలో గ్రీన్‌ బాండ్లు, గ్రీన్‌ ఫైనాన్సింగ్‌ ఎక్కువ ఆమోదం పొందుతున్నాయి. 

చదవండి: ఫైర్‌ సెఫ్టీ యాక్ట్‌లో మార్పులు చేయండి - నరెడ్కో విజ్ఞప్తి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top