Infosys Recruitment: ఐటీ ఫ్రెషర్స్‌కు శుభవార్త.. రెండు నెలల్లో 55 వేల ఉద్యోగాల నియామకం!

Infosys likely to hire 55000 or more freshers in FY23: CEO Salil Parekh - Sakshi

ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సంస్థ ఐటీ ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. గ్లోబల్ గ్రాడ్యుయేట్ హైరింగ్ ప్రోగ్రాం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 55 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంటున్నట్లు సీఈఓ సలీల్ పరేఖ్ తెలిపారు. "మేము ఈ ఆర్థిక సంవత్సరంలో 55,000 కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకోబోతున్నాము. ఈ ప్రక్రియ 2 నెలల్లో ముగుస్తుంది. మేము వచ్చే సంవత్సరంలో ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నాము" అని పరేఖ్ నేడు(ఫిబ్రవరి 16న) నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్ షిప్ ఫోరం 2022(ఎన్‌టిఎల్ఎఫ్)లో అన్నారు. ఈ ఎన్‌టిఎల్ఎఫ్ ఫోరం ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు జరగనుంది. 

కాలేజీ గ్రాడ్యుయేట్లకు ఆరు నుంచి 12 వారాల మధ్య కాలంలో కంపెనీ సమగ్రమైన శిక్షణా అందిస్తుంది అని అన్నారు. ఈ ఏడాది కంపెనీ నియమించుకొనే 55,000 ఉద్యోగులలో 52000 మంది భారత దేశం నుంచి అయితే, మరొక 3,000 మ౦దిని బయట నుంచి నియమించుకొనున్నట్లు పరేఖ్ తెలిపారు. విద్యార్ధులు క్లౌడ్, డేటా అనాలిసిస్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఐఓటి వంటి కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలని పరేఖ్ సూచించారు. వ్యాపార పరంగా, పెద్ద క్లౌడ్ & డిజిటల్ సంస్థలు ఇప్పుడు ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి అని అన్నారు. ఫ్రెషర్స్ నియామకం పెరుగుతున్నప్పటికీ కంపెనీలలో అట్రిషన్ రేటు పెరుగుతుంది. డిసెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ సంస్థలో అట్రిషన్ రేటు 25.5 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 20 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

(చదవండి: గూగుల్ పే సూపర్ ఆఫర్.. నిమిషాల్లో లక్ష రూపాయల లోన్!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top