
ముంబై: విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు రెండో వారమూ కరిగిపోయాయి. అక్టోబర్ 3వ తేదీతో ముగిసిన వారంలో 276 మిలియన్ డాలర్లు తగ్గి 699.96 బిలియన్ డాలర్లకు పరిమితయ్యాయి. అంతకుముందు వారంలో ఇవి 2.334 బిలియన్ డాలర్లు తగ్గి 700.236 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్‌బీఐ డేటా తెలిపింది.
సమీక్షా వారంలో, విదేశీ కరెన్సీ ఆస్తులు 4.049 బిలియన్ డాలర్లు తగ్గి 577.708 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బంగారం నిల్వల విలువ 3.753 బిలియన్ డాలర్లు పెరిగి 98.77 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(ఎస్‌డీఆర్) 25 మిలియన్లు పెరిగి 18.814 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) వద్ద భారత ద్రవ్య నిల్వలు 4 మిలియన్ డాలర్లు తగ్గి 4.6669 బిలియన్ డాలర్లుగా నమోదైంది.