
ప్రముఖ భారతీయ క్రికెటర్ తిలక్ వర్మ తన తండ్రికి మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈని బహుమతిగా ఇచ్చారు. తన తల్లిదండ్రులకు ఈ కారు బహుమతినిస్తూ దిగిన ఫొటోలు ‘మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ’ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అప్‌లోడ్ చేశారు. ఇవికాస్తా వైరల్‌గా మారాయి. ఈ మోడల్ విడుదలైనప్పటి నుంచి భారత మార్కెట్‌లో వినియోదారుల ఆదరణ పెరుగుతోంది. వేరియంట్‌ను అనుసరించి ఈ మహీంద్రా ఎక్స్ఈవీ 9వీ ఫీచర్లు, ధరలు విభిన్నంగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఈ కీలక ఫీచర్లు
బ్యాటరీ వేరియంట్లు: 59 కిలోవాట్‌హవర్ (542 కిలోమీటర్ల పరిధి) లేదా 79 కిలోవాట్‌హవర్ (656 కిలోమీటర్ల పరిధి)
పవర్ అవుట్‌పుట్: వేరియంట్‌ను అనుసరించి 282బీహెచ్‌పీ, 380ఎన్ఎమ్ టార్క్ వరకు పవర్ ఇస్తుంది.
ఇన్ఫోటైన్‌మెంట్: ట్రిపుల్ 12.3 అంగుళాల స్క్రీన్లు + రియర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్లు.
ఎంఏఐఏ (మహీంద్రా AI ఆర్కిటెక్చర్)
క్వాల్ కాం స్నాప్‌డ్రాగన్ 8295 ప్రాసెసర్
24 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
భద్రత: 7 ఎయిర్ బ్యాగులు, లెవల్ 2+ ఏడీఏఎస్, 360 డిగ్రీ కెమెరా.
ధరల శ్రేణి (ఎక్స్-షోరూమ్): వేరియంట్‌ను బట్టి రూ.21.90 లక్షలు నుంచి రూ.31.25 లక్షలు వరకు(కొత్త జీఎస్టీ అమలు నేపథ్యంలో ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది)
ఇదీ చదవండి: పని మొదలు పెట్టాలంటే ఏడుపొస్తుంది!