మొబైల్‌ డేటా జోరు | India Mobile Data Usage Surges 31GB Per User Monthly in 2025 | Sakshi
Sakshi News home page

మొబైల్‌ డేటా జోరు

Apr 3 2026 9:06 AM | Updated on Apr 3 2026 10:41 AM

India Mobile Data Usage Surges 31GB Per User Monthly in 2025

భారత్‌లో నెలకు సగటున 31 జీబీ వినియోగం

2025పై నోకియా నివేదిక 

దేశీయంగా మొబైల్‌ డేటా వినియోగం గణనీయంగా పెరుగుతోంది. 2024లో ప్రతి యూజరు నెలకు సగటున 27.5 జీబీ వినియోగించగా 2025లో ఇది 31 జీబీకి పెరిగింది. టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వార్షిక మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇండెక్స్‌ (ఎంబీఐటీ) 13వ ఎడిషన్‌ ప్రకారం గత ఐదేళ్లలో డేటా వినియోగం వార్షిక ప్రాతిపదికన 18 శాతం మేర వృద్ధి చెందింది. 

మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ లభ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ అప్లికేషన్స్, 4కే వీడియో స్ట్రీమింగ్, క్లౌడ్‌ గేమింగ్‌లాంటి అవసరాల కోసం డేటాకి డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. 2025లో భారత్‌లో మొత్తం డేటా ట్రాఫిక్‌ ప్రతి నెలా 27 ఎక్సాబైట్స్‌కి (ఈబీ) చేరింది. సంఖ్యాపరంగా 5జీ యూజర్లకు సంబంధించి భారత్‌.. ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది.

మరిన్ని విశేషాలు..

  • డేటా ట్రాఫిక్‌ వృద్ధికి ఫిక్సిడ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ (ఎఫ్‌డబ్ల్యూఏ) కూడా కీలకంగా ఉంటోంది. మొత్తం 5జీ డేటాలో ఈ విభాగం వాటా 25 శాతం పైగా ఉంది. వార్షికంగా 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ సబ్‌స్క్రైబర్స్‌ సంఖ్య రెండు రెట్లు పెరిగింది.

  • 5జీ వినియోగం వేగవంతంగా పెరుగుతుండటం, ఏఐ ఆధారిత యాప్స్‌ ప్రభావంతో భారత్‌లో మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ విభాగం కొత్త దశలోకి అడుగుపెడుతోంది.

  • 5జీ వినియోగంలో మెట్రో సర్కిల్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఆయా మార్కెట్లలో మొత్తం మొబైల్‌ డేటా ట్రాఫిక్‌లో 58 శాతం వాటా 5జీ టెక్నాలజీదే ఉంటోంది.

  • యాక్టివ్‌ 4జీ డివైజ్‌ల సంఖ్య 2025లో 89.2 కోట్లకు చేరింది. ఇందులో 5జీ సామర్థ్యాలు ఉన్న డివైజ్‌ల సంఖ్య 38.3 కోట్లుగా ఉంది.  

  • బడ్జెట్‌ 5జీ ఫోన్ల (100 డాలర్ల లోపు ధర) సంఖ్య పది రెట్లు పైగా వృద్ధి చెందింది. గతేడాది విక్రయించిన 90 శాతం స్మార్ట్‌ ఫోన్లు 5జీని సపోర్ట్‌ చేస్తాయి.

  • రాబోయే రోజుల్లో 2031 నాటికి భారత్‌లో 5జీ సబ్‌స్క్రయిబర్స్‌ సంఖ్య 100 కోట్ల స్థాయిని దాటుతుందని అంచనా.

ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా?

Advertisement
 
Advertisement
Advertisement