బొలీవియా కంపెనీతో చేతులు కలిపిన ఆల్ట్‌మిన్ - ఎందుకో తెలుసా? | Sakshi
Sakshi News home page

బొలీవియా కంపెనీతో చేతులు కలిపిన ఆల్ట్‌మిన్ - ఎందుకో తెలుసా?

Published Thu, Nov 16 2023 6:01 PM

India Altmin and Bolivia YLB Partnership Details - Sakshi

దక్షిణ అమెరికాలో లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేయడానికి యాక్టివ్ మెటీరియల్స్ కోసం పైలట్ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి బొలీవియన్ స్టేట్ కంపెనీ 'యాసిమియంటోస్ డి లిటియో బొలీవియానోస్' (YLB)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్ బేస్డ్ బ్యాటరీ యాక్టివ్ మెటీరియల్స్ తయారీ కంపెనీ ఆల్ట్‌మిన్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది.

ముడి పదార్థాల సరఫరాలను అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా.. లిథియం అయాన్ బ్యాటరీల కోసం కాథోడ్ యాక్టివ్ మెటీరియల్స్ (CAMs) ఉత్పత్తి కోసం ఈ ఒప్పదం జరిగినట్లు తెలుస్తోంది. స్వదేశీ లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో పురోగతి కోసం ఏర్పడిన ఈ సహకారం మొదటిది. ఇది మొత్తం సరఫరా గొలుసును సానుకూలంగా ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుంది.

ఈ భాగస్వామ్యం లిథియం కోసం పరిశోధన, అభివృద్ధి, పైలటింగ్ కార్యకలాపాలను మెరుగుపరచడం.. ద్వైపాక్షిక ముడి పదార్థాల సరఫరా గొలుసును ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. గత నెలలో YLB నుంచి కొంత మంది నిపుణుల బృందం హైదరాబాద్‌లోని ఆల్ట్‌మిన్ ప్రైవేట్ లిమిటెడ్ సందర్శించింది. ఆ తరువాత బొలీవియన్ ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ ఈ ఒప్పందాన్ని ఆమోదించుకోవడానికి, 'ఆల్ట్‌మిన్'ను బొలీవియాకు ఆహ్వానించింది.

ఈ ఒప్పందం ఏర్పర్చుకున్న సందర్భంగా YLB ప్రెసిడెంట్ 'కార్లా కాల్డెరాన్' మాట్లాడుతూ.. ఈ సమావేశం లిథియం అయాన్ బ్యాటరీల క్రియాశీల పదార్థాల సాంకేతిక అభివృద్ధికి సహకారాన్ని అందిస్తుంది, పోటోసిలో పైలట్ ప్లాంట్‌ను అమలు చేయడం ద్వారా, పైలట్ ప్లాంట్ ఈ సంవత్సరం 3 గిగావాట్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు.

ఇదీ చదవండి: దీపావళికి నెట్‌లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్

ఆల్ట్‌మిన్ వ్యవస్థాపకుడు,ఎండీ 'మౌర్య సుంకవల్లి' మాట్లాడుతూ.. YLBతో చేతులు కలపడంతో ప్రపంచ బ్యాటరీ మార్కెట్‌లో కంపెనీ గొప్ప స్థానం పొందుతుందని భవిస్తున్నాము. 2030 నాటికి ఆల్ట్‌మిన్ 10 GWh LFPని ఉత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తుందని వెల్లడిస్తూ.. ఖనిజ విభాగంలో రెండు దేశాల మధ్య ఏర్పడిన ఈ ఒప్పందం ఓ ముఖ్యమైన మైలురాయి అని తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement