హెచ్‌పీ ఇండియా దేశీయ మార్కెట్లో ఒకేసారి 20 కంటే ఎక్కువ ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. ఇందులో ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, AI ఆధారిత డివైజ్‌లు ఉన్నాయి.
విద్యార్థులు, క్రియేటర్లు, ప్రొఫెషనల్స్, చిన్న వ్యాపారుల వరకు అందరికీ సులభమైన, లేటెస్ట్ టెక్నాలజీని అందించడమే ప్రధాన ఉద్దేశ్యంగా కంపెనీ కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. ఇందులో ముఖ్యంగా రెండు కొత్త కేటగిరీలు ఉన్నాయి.
మొదటిది హెచ్‌పీ ఓమ్నిపాడ్ 12. ఇది టాబ్లెట్‌లా ఉపయోగించుకోవచ్చు. కానీ.. పీసీ మాదిరిగా పనితీరును అందించే ఒక కొత్త డివైజ్. తొలిసారి కంప్యూటర్ ఉపయోగించే విద్యార్థులు, చిన్న వ్యాపారాలు, సాధారణ వినియోగదారులకు ఇది ఉపయోగపడుతుంది. దీని ప్రారంభ ధర రూ.48,999.
రెండవది హెచ్‌పీ ఎలైట్ బోర్డ్ G1a Next Gen AI PC. ఇది ప్రపంచంలోనే మొదటి AI కీబోర్డ్ బేస్డ్ కంప్యూటర్. ఆఫీస్ వినియోగం కోసం, తేలికగా ఉపయోగించగలిగే విధంగా ఉంటుంది. ఇది మంచి పనితీరును అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.89900.
కంపెనీ లాంచ్ చేసిన ఇతర ఉత్పత్తులలో.. ఎలైట్ బుక్, ప్రోబుక్, ఓమ్నిబుక్ సిరీస్ ల్యాప్‌టాప్‌లు, AI బేస్డ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్లు, కొత్త ప్రింటింగ్ టెక్నాలజీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ హెచ్‌పి ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్, రిలయన్స్, హెచ్‌పి వరల్డ్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.


