ఈ 'కూలింగ్ పేపర్' ఉంటే చాలు ఇంట్లో ఏసీ అక్కర్లేదు!

How To Keep Cool Your Home Without Turning On The AC - Sakshi

భూమి మీద రోజు రోజుకి భారీగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. వేసవి కాలంలో ఈ ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఏసీ, కూలర్లు వారి ఇంట్లో వాడుతున్నారు. వీటి వల్ల విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో దీని ప్రభావం వాతావరణం మీద పడుతుంది. ఇలా ఏసీలు, కూలర్ల వల్ల డబ్బు వృదా కావడంతో పాటు వాతావరణం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే, ఈ సమస్యకు చైనాకు చెందిన ఈస్ట్రన్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న యీ జెంగ్(Yi Zheng) పరిష్కారం కనుగొన్నారు. 

సంప్రదాయ కూలింగ్ వ్యవస్థలపై ఆధారపడకుండా భవనాలు, ఇతర వస్తువులను చల్లగా ఉంచడానికి ఉపయోగించే ఒక స్థిరమైన మెటీరియల్ ను రూపొందించారు. దీనిని యి జెంగ్ తన మెటీరియల్ ను "కూలింగ్ పేపర్" అని పిలుస్తారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఏదో ఒక రోజు ఈ కూలింగ్ పేపర్ అమార్చుకోవాలని తను ఆశిస్తున్నారు. ఈ "కూలింగ్ పేపర్" సూర్యుని నుంచి వచ్చే వేడిని గ్రహించుకొని తిరిగి పరావర్తనం చేస్తుంది. దీని వల్ల గది ఉష్ణోగ్రతలను 10 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు తగ్గించవచ్చు అని ఆయన పేర్కొన్నారు. "కూలింగ్ పేపర్"కు ఎలాంటి విద్యుత్ అవసరం లేదు, దీనిని 100శాతం రీసైకిల్ చేయవచ్చు. ఈ కూలింగ్ పేపర్ రీసైకిల్ పేపర్ నుంచి తయారుచేశారు. ఇది మీ ఇంటిపై ఉన్నంతసేపు ఇంట్లోని ఉష్ణోగ్రతలు లాగేసుకుని ఎప్పుడూ చల్లగా ఉంచుతుంది.
 

"కూలింగ్ పేపర్" ఎలా తయారు చేయాలి?
ముందుగా న్యూస్‌ప్రింట్‌ను నానబెట్టాలి, బ్లెండర్‌లో ముక్కలు ముక్కలు చేసి తర్వాత నీటిని తీసేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో టెఫ్లాన్ తయారు చేసే పదార్థంను కలపాలి. కూలింగ్ పేపర్ లోపల ఉండే "సహజ ఫైబర్ల రంధ్రాల సూక్ష్మ నిర్మాణం" వేడిని శోషించుకొని ఇంటి నుంచి దూరంగా బదిలీ చేస్తుంది. ఆ తర్వాత అవసరం లేనప్పుడు కూలింగ్ పేపర్ తీసెసీ తర్వాత జెంగ్ కూలింగ్ పేపర్‌ను రీసైక్లింగ్ చేయడానికి కొత్త షీట్ ను రీమేక్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఈ ప్రక్రియలో అది ఎటువంటి శీతలీకరణ శక్తిని కోల్పోలేదని కనుగొన్నాడు. "తను వచ్చిన ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు" జెంగ్ చెప్పాడు. బహుశా రీసైక్లింగ్ తర్వాత 10 శాతం, 20 శాతం నష్టం జరుగుతుందని అనుకున్నాడు, కానీ అలా ఏమి జరగలేదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top