నిరుద్యోగులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తీపికబురు

HDFC Bank to Hire 2500 People, Double Reach To 2 Lakh Villages - Sakshi

ముంబై: నిరుద్యోగులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తీపికబురు అందించింది. బ్రాంచీ నెట్ వర్క్, బిజినెస్ కరస్పాండెంట్లు, బిజినెస్ ఫెసిలిటేటర్లు, డిజిటల్ అవుట్ రీచ్ ప్లాట్ ఫారమ్ వంటి మొదలైన వారి కలయికతో రాబోయే 18-24 నెలల్లో 2,00,000 గ్రామాలకు తమ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రైవేట్ రంగ రుణదాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. ఇందులో భాగంగా రాబోయే ఆరు నెలల్లో 2500 మందిని నియమించుకొనున్నట్లు కూడా పేర్కొంది. దేశంలోని మొత్తం గ్రామాలలో మూడింట ఒక వంతు మందికి కొత్తగా బ్యాంక్ సేవలు అందే అవకాశం ఉన్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.(చదవండి: అమ్మాయిలకు అద్దె ఇళ్ల కష్టాలు.. బౌన్సర్లతో బెదిరింపులు)

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుతం 550కి పైగా జిల్లాల్లోని సూక్ష్మ, చిన్న & మధ్యతరహా సంస్థలకు(ఎంఎస్ఎంఈలు) సేవలను అందిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,00,000 గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. గ్రామాల్లో కోతకు ముందు - కోత అనంతర పంట రుణాలు, ద్విచక్ర వాహనాలు రుణాలు, ఆటో రుణాలు, బంగారంపై రుణాలు అందిస్తున్నట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. వేగంగా మారుతున్న గ్రామీణ పర్యావరణ వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త మార్పులు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. "భారత ప్రభుత్వం, వివిధ పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మారుస్తోంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో బాధ్యతాయుతమైన నాయకుడిగా, సమాజంలోని అన్ని వర్గాలకు అత్యుత్తమ శ్రేణి బ్యాంకింగ్ ఉత్పత్తులు & సేవలను అందించాలని మేము విశ్వసిస్తున్నాము" అని శుక్లా తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top