ఎల్‌ఐసీ నూతన చైర్మన్‌గా సిద్ధార్థ మొహంతి

Govt appoints Siddhartha Mohanty as LIC chairperson till June 2024 - Sakshi

ఇప్పటివరకూ తాత్కాలికగా చైర్మన్‌గా ఉన్న సిద్ధార్థ మొహంతి

2024, జూన్‌ వరకు ఎల్‌ఐసీ  ఛైర్మన్‌గా  సిద్ధార్థ  మొహంతి

సాక్షి, ముంబై: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి)  చైర్మన్‌గా సిద్ధార్థ మొహంతిని ప్రభుత్వం నియమించింది.  రాయిటర్స్‌  రిపోర్ట్‌ ప్రకారం  2024 జూన్‌ వరకు  మొహంతి ఈ పదవిలో కొనసాగుతారు.  ఆ తర్వాత జూన్ 7, 2025 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. ఇప్పటివరకు ఆయన తాత్కాలిక ఛైర్మన్‌గా  ఉన్న సంగతి తెలిసిందే. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్‌: సంబరాల్లో ఉద్యోగులు)

సిద్ధార్థ మొహంతి ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కి సీఎండీగా ఉన్నారు. అయితే 2021 ఫిబ్రవరిలో ఎల్‌ఐసీ ఎండీగా  నియమితులయ్యారు. ఇక్కడ చేరడానికి ముందు, ఎల్‌ఐసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-లీగల్‌గా ఉన్నారు. 1985లో ఎల్‌ఐసీ డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించిన మొహంతి ఆ తరువాత ఉన్నత స్థాయికి ఎదిగారు. మూడు దశాబ్దాల పాటు సాగిన కెరీర్‌లో, మార్కెటింగ్, హెచ్‌ఆర్, ఇన్వెస్ట్‌మెంట్స్, లీగల్ రంగాలలో మొహంతి తనదైన ముద్ర వేశారు. 

(ఇదీ చదవండి: Amazon layoffs: నంబర్‌ గేమ్ అంతే..రేపటితో తొమ్మిదేళ్లు..ఇంతలోనే!)

మొహంతి రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్. అలాగే న్యాయశాస్త్రంలో పట్టాతోపాటు, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో  పీజీ చేశారు. ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి లైసెన్షియేట్ కూడా. మార్చి 11న కేంద్రం మొహంతిని మూడు నెలల పాటు  తాత్కాలిక చైర్‌పర్సన్‌గా నియమించింది. మినీ ఐపే ,బి సి పట్నాయక్ సహా ఎల్‌ఐసీ ముగ్గురు డైరెక్టర్లలో ఒకరైన మొహంతీని చైర్మన్ పదవికి షార్ట్‌లిస్ట్ చేసింది. కంపెనీకి చెందిన నలుగురు మేనేజింగ్ డైరెక్టర్ల నుండి ఛైర్మన్‌ను ఎంపిక చేస్తారు.ఇందులో తుది నిర్ణయం కేంద్రం తీసుకుంటుంది. సాధారణంగా ఎల్‌ఐసీలో ఒక చైర్‌పర్సన్ , నలుగురు  ఎండీలు ముఖ్య నిర్వాహక సిబ్బందిగా ఉంటారు.

(Vanisha Mittal Amit Bhatia Love Story: వనీషా...అమిత్‌ లవ్‌ స్టోరీ తెలుసా? ఈ లవ్‌ బర్డ్స్‌ పెళ్లి ఒక రికార్డ్‌ )

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top