అక్కడా ఉంటా.. ఇక్కడా ఉంటా.. గూగుల్‌ ద్విముఖ వ్యూహం?

Google Invested One Billion Dollars In Airtel - Sakshi

డిజిటలైజేషన్‌ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఇండియా మార్కెట్‌లో పాతుకుపోయేలా గూగుల్‌ పక్కా ప్లాన్‌తో ముందుకు పోతుంది. అందులో భాగంగా ఇప్పటికే జియోలో పెట్టుబడులు పెట్టిన గూగుల్‌ తాజాగా ఎయిర్‌టెల్‌లో సైతం బిలియన్‌ ఇన్వెస్ట్‌ చేసేందుకు రెడీ అయ్యింది. ఇదీ విషయాన్ని భారతీ ఎయిర్‌టెల్‌ అధికారికంగా ప్రకటించింది. 

దేశంలో అతి పెద్దవైన రెండు టెలికాం కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా గూగుల్‌ వ్యహాత్మకంగా వ్యవహారిస్తోంది. టెలికాం ఆపరేటర్ల ద్వారా ఆండ్రాయిడ్‌ ఆధారిత సర్వీసెస్‌ని ప్రజలకు మరింత చేరువగా తీసుకుపోవచ్చనే అంచనాలతో ఉంది. తద్వారా ఇండియన్‌ మార్కెట్‌లో చెక్కుచెదరని బేస్‌ ఏర్పడుతుందని గూగుల్‌ భావిస్తోంది. అందుకే టెలికాం మార్కెట్‌లో ఎదురెదురుగా నిలిచిన రెండు కంపెనీల్లో ఏకకాలంలో పెట్టుబడులు పెట్టింది గూగుల్‌.

జియోతో చేతులు కట్టిన తర్వాత రెండు సంస్థలు సంయుక్తంగా జియో నెక్ట్స్‌ పేరుతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్‌లోకి తెచ్చారు. ఇదే తరహా వ్యూహాన్ని ఎయిర్‌టెల్‌తో కూడా గూగుల్‌ అమలు చేయనుంది. మొత్తంగా ఇద్దరు టెలికాం దిగ్గజ కంపెనీలతో సత్సంబంధాలను నెరుపుతోంది గూగుల్‌.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top