బంగారం, వెండి ధరలు తగ్గుముఖం

Gold Rates Are Sharply Down From Their Last Months Highs - Sakshi

డాలర్‌ బలోపేతంతో వన్నెతగ్గిన పసిడి

ముంబై : బంగారం ధరలు గురువారం వరుసగా మూడోరజూ దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరల పతనం కొనసాగింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 50 రూపాయలు తగ్గి 50,771 రూపాయలు పలికింది. ఇక కిలో వెండి 524 రూపాయలు తగ్గి 65,260 రూపాయలకు దిగివచ్చింది. చదవండి : ఆల్‌టైం హై నుంచి రూ . 5000 దిగివచ్చిన బంగారం

డాలర్‌ బలోపేతం కావడంతో మదుపరులు కరెన్సీలో, షేర్లలో పెట్టుబడులకు మొగ్గుచూపడంతో పసిడికి డిమాండ్‌ తగ్గిందని నిపుణులు పేర్కొన్నారు. ఆర్థిక రికవరీ అంచనాలతో అమెరికా సహా అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కూడా బంగారం ధరలపై ప్రభావం చూపాయని కొటాక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. అమెరికా డాలర్‌ లాభపడుతున్న క్రమంలో బంగారం ధరల్లో అనిశ్చితి కొనసాగుతుందని, పసిడి ధరలు భారీగా పడిపోతే కొనుగోళ్లు ఊపందుకోవచ్చని పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top