రూ . 50,000 మార్క్‌ దాటిన పసిడి

Gold Price Back Above Rs 50000 Mark - Sakshi

బంగారం బాటలో వెండి

ముంబై : గత కొద్ది సెషన్స్‌లో వరుసగా పతనాల బాట పట్టిన పసిడి మంగళవారం పైపైకి ఎగబాకింది. రూపాయ క్షీణించడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదలతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం భారమైంది. వరుస పతనాలకు బ్రేక్‌పడటంతో యల్లోమెటల్‌ తిరిగి రూ 50,000 మార్క్‌ దాటింది. అమెరికాలో ఉద్దీపన ప్యాకేజ్‌పై సంకేతాలతో కూడా బంగారం ధరలు పుంజుకున్నాయి. ఇక ఎంసీఎక్స్‌లో మంగళవారం పదిగ్రాముల బంగారం 287 రూపాయలు భారమై 50,420 రూపాయలకు ఎగబాకాయి.

కిలో వెండి ఏకంగా 995 రూపాయలు పెరిగి 61,391 రూపాయలు పలికింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌గోల్డ్‌ 1.56 డాలర్లు ఎగబాకి ఔన్స్‌కు 1882 డాలర్లుగా నమోదైంది. అమెరికా అధ్యక్ష అభ్యర్ధుల మధ్య చర్చలకు ముందు డాలర్‌ బలహీనపడటంతో బంగారం గతవారం నష్టాలను అధిగమించిందని మోతీలాల్‌ ఓస్వాల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నవనీత్‌ దమానీ పేర్కొన్నారు. చదవండి : ఊరట : రూ . 50,000 దిగువకు పసిడి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top