ఆర్థిక సేవల్లోకి ఐషర్‌ మోటర్స్‌ | Eicher Motors Expands into Financial Services with Volvo Partnership | Sakshi
Sakshi News home page

ఆర్థిక సేవల్లోకి ఐషర్‌ మోటర్స్‌

May 26 2026 8:28 PM | Updated on May 26 2026 8:31 PM

Eicher Motors Expands into Financial Services with Volvo Partnership

ఐషర్‌ మోటర్స్‌ తాజాగా వోల్వో గ్రూప్‌తో కలిసి ఆర్థిక సేవల విభాగంలోకి విస్తరిస్తోంది. వోల్వో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ (వీఎఫ్‌ఎస్‌) ఇండియాలో 50 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం సంస్థ రూ. 750 కోట్లు వెచ్చించనుంది.

ప్రస్తుతం ఐషర్‌ (ఈఎంఎల్‌), వోల్వో గ్రూప్‌నకు వోల్వో ఐషర్‌ కమర్షియల్‌ వెహికల్స్‌ (వీఈసీవీ) పేరుతో జాయింట్‌ వెంచర్‌ ఉంది. ప్రతిపాదిత ఆర్థిక సేవల జాయింటు వెంచరనేది భారత్‌లో వీఈసీవీ, ఈఎంఎల్, వోల్వో గ్రూప్‌ ఉత్పత్తులకు క్యాప్టివ్‌ ఫైనాన్సింగ్‌ సంస్థగా వ్యవహరిస్తుంది. వోల్వో గ్రూప్‌తో 18 ఏళ్ల భాగస్వామ్యాన్ని వాహనాలకు ఫైనాన్సింగ్‌ వ్యాపారంలోకి విస్తరిస్తున్నట్లు ఈఎంఎల్‌ చైర్మన్‌ సిద్ధార్థ లాల్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement