పండుగ ఆఫర్‌, టాటా మోటర్స్‌పై భారీ తగ్గింపు | On this Diwali, Tata Motors Offering Attractive Discounts | Sakshi
Sakshi News home page

పండుగ ఆఫర్‌, టాటా మోటర్స్‌పై భారీ తగ్గింపు

Nov 4 2020 11:46 AM | Updated on Nov 4 2020 11:51 AM

On this Diwali, Tata Motors Offering Attractive Discounts - Sakshi

దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ ప్రముఖ కార్ల కంపెనీ టాటా మోటర్స్‌ తన బీఎస్‌6 పాపులర్‌ మోడల్స్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది.  నవంబర్ 2020 లో  కొన్ని సెలక్ట్‌ మోడళ్లపై రూ.65,000 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు టాటామోటర్స్‌ అధికారికంగా ప్రకటించింది.  ఆఫర్లు ప్రకటించిన కార్లలో  టియాగో హ్యాచ్‌బ్యాక్, టైగర్ సెడాన్, నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, హారియర్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలు ఉన్నాయి. ఈ కార్లపై  నవంబర్ 1, 2020 నుంచి డిస్కౌంట్లు  వర్తించనున్నాయి. ఈ ఆఫర్లు  2020 నవంబర్ 30 వరకు చెల్లుతాయి. ఈ ప్రయోజనాలు వినియోగదారుల పథకం, ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరియు కార్పొరేట్ ఆఫర్లను కలిగి ఉంటాయి, ఇవి అక్టోబర్ 2020 వరకు చెల్లుతాయి.


 హారియర్ ఎస్‌యూవీ వాహనంపై గరిష్టంగా రూ. 65,000 వరకు తగ్గింపును అందించనున్నారు. అదేవిధంగా  ఈ నెలలో టాటా ఆల్ట్రోజ్‌పై ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ నెల . ఈ నెల ఆఫర్లలో కన్స్యూమర్‌ స్కీమ్‌,  ఎక్స్ఛేంజ్ ఆఫర్ , కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి. అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపిన ప్రకారం టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ పై మొత్తం రూ. 25,000వరకు ప్రయోజనం పొందవచ్చు. అదేవిధంగా  టైగర్ సెడాన్‌పై  గరిష్టంగా రూ. 30,000 వరకు లాభం చేకూరనుంది. ఇందులో రూ. 15,000 వరకు కన్స్యూమర్‌ స్కీం ద్వారా, మిగిలిన రూ. 15,000 ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌లో పొందవచ్చు.  

చదవండి: ఈ చిన్న షేర్లు మార్కెట్లనే మించాయ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement