వాట్సాప్​లో మరో సరికొత్త ఫీచర్, యూజర్లకు ఇక పండగే

Did You Know How To Best Quality Videos Sharing From Whatsapp   - Sakshi

వీడియో క్వాలిటీ పై ఫోకస్‌ 

ఫీచర్‌ పై వర్క్‌ చేస్తున్న వాట్సాప్‌ 

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. ఈ ఫీచర్‌తో వాట్సాప్‌లో హైక్వాలిటీ వీడియోల్ని సెండ్‌చేసే సౌకర్యం అందుబాటులోకి  రానుంది. వాస్తవానికి వాట్సాప్‌ నుంచి మరో వాట్సాప్‌కు కేవలం 16ఎంబీ వీడియోను మాత్రమే షేర్‌ చేసే సదుపాయం ఉంది. దీనివల్ల వినియోగదారులు వీడియో క్వాలిటీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాట్సాప్‌ ద్వారా హై క్వాలిటీ వీడియోల్ని సెండ్‌ చేయలేకపోతున్నామని, అందుకోసం ఫీచర్‌ను తీసుకొని రావాలంటూ  వాట్సాప్‌ యాజమాన్యానికి పెద్ద ఎత్తున మెయిల్స్‌ పెట్టారు. దీంతో వాట్సాప్‌ యాజమాన్యం ఇకపై హై క్వాలిటీ వీడియోల్ని సెండ్‌ చేసేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తులు చేసింది.  

వీ బీటా ఇన్ఫోరిపోర్ట్‌ ప‍్రకారం.. వీడియో అప్‌లోడ్‌ క్వాలిటీ పేరుతో ప్రస్తుతం వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ 2.21.14.6 ఫీచర్‌పై వర్క్‌ చేస్తోంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత హైక్వాలిటీ వీడియోల్ని షేర్‌ చేసే అవకాశం ఉంది. "ఆటో, బెస్ట్‌ క్వాలిటీ, డేటా సర్వర్‌" పేరుతో మూడు ఆప్షన్‌లను యాడ్‌ చేయనుంది. 
 
ఆటో: ఆప్షన్‌ ద్వారా వీడియో క్వాలిటీ తగ్గకుండా సైజును మాత్రమే తగ్గించి సెండ్‌ చేసేందుకు వీలుంది
బెస్ట్‌ క్వాలిటీ : ఈ ఆప్షన్‌ ద్వారా హై రెజెల‍్యూషన్‌ వీడియోల్ని షేర్‌ చేసుకోవచ్చు. 
డేటా సేవర్ : ఈ ఆప్షన్‌ ద్వారా ఇంటర్‌ నెట్‌ హై బ్యాండ్‌ విత్‌ లేకపోయినా వీడియోను కంప్రెస్‌ చేసి సెండ్‌ చేసుకోవచ్చు. బ‍్యాండ​ విత్‌ లేకుండా వీడియోను కంప్రెస్‌ చేస‍్తే క్వాలిటీ మిస్‌ అవుతుందనే డౌట్‌ రావచ్చు.కానీ డేటా సేవర్‌ ఆప్షన్‌ వీడియో క్వాలిటీ తగ్గకుండా కంప్రెస్‌ చేయడంపై దృష్టిసారిస్తున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ పై వర్క్‌చేస్తుండగా, త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని వాట్సాప్​ బీటా ఇన్ఫో పేర్కొంది.  

చదవండి: వాట్సాప్​లో మరో సరికొత్త ఫీచర్, యూజర్లకు ఇక పండగే

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top