
ఆదాయపు పన్ను రిఫండ్‌లు ఆలస్యం కావడంపై.. చాలా మంది పన్ను చెల్లింపుదారులు సోషల్ మీడియాలో తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITR) సకాలంలో దాఖలు చేస్తున్నప్పటికీ, ఇప్పటికీ తమ రీఫండ్‌లను పొందడంలో జాప్యాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఆలస్యానికి కారణం ఏమిటో ఈ కథనంలో చూసేద్దాం..
డేటా సరిపోలేకపోవడం: మీ ఐటీఆర్, ఫారమ్ 26ఏఎస్ లేదా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS)లోని వివరాలు మధ్య ఏదైనా తేడా ఉంటే.. రిటర్న్ నిలిచిపోతాయి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పు ఉండటం, ఐఎఫ్ఎస్సీ కోడ్‌లలో ఏదైనా తప్పు ఉంటే కూడా ఆలస్యం జరగవచ్చు.
ఈ-వెరిఫై చేయడంలో వైఫల్యం: ఐటీఆర్ దాఖలు చేసిన 30 రోజులలోపు ఈ-వెరిఫికేషన్ తప్పనిసరి. ఇది మిస్ అయితే ఐటీఆర్ అసంపూర్ణంగా పరిగణిస్తారు. రిటర్న్ ప్రాసెస్ జరగదు.
పెండింగ్ పన్ను బకాయిలు: గత సంవత్సరాల నుంచి చెల్లించాల్సిన పన్నులు ఉంటే, ఆ బకాయిలకు వ్యతిరేకంగా ప్రస్తుత వాపసు మొత్తాన్ని శాఖ సర్దుబాటు చేయవచ్చు, దీని ఫలితంగా రిటర్న్ తగ్గే అవకాశం ఉంది. కొన్నిసార్లు రాకుండా కూడా పోయింది.
రిటర్న్ అండర్ స్క్రూటినీ: కొన్ని ఐటీఆర్‌లు వివరణాత్మక పరిశీలన లేదా ధృవీకరణ కోసం ఎంపిక చేయడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో కూడా రిటర్న్ ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత రిటర్న్స్ పొందుతారు.
పాన్-ఆధార్ లింకింగ్ సమస్యలు: పాన్ ఆధార్‌తో లింక్ చేయకపోతే.. లేదా పేరు, ఇతర వ్యక్తిగత వివరాలు ఐటీఆర్, బ్యాంక్ అకౌంట్ - ఆధార్ మధ్య సరిపోలకపోతే, రీఫండ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. పాన్ నెంబర్ తప్పు అయితే.. రిటర్న్స్ ఆగిపోవచ్చు.
చివరి నిమిషంలో దాఖలు చేయడం: గడువుకు దగ్గరగా చాలా మంది వ్యక్తులు తమ రిటర్న్‌లను దాఖలు చేస్తారు. ఇది పోర్టల్‌పై లోడ్‌ను పెంచుతుంది. తద్వారా ప్రాసెసింగ్ నెమ్మదిస్తుంది.
ఆఫ్‌లైన్ రిటర్న్ ఫైలింగ్: ఆఫ్‌లైన్ రిటర్న్ ఫైలింగ్ చేసినప్పుడు.. రిటర్న్‌లను మాన్యువల్ వెరిఫికేషన్ కారణంగా ప్రాసెస్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా రిటర్న్ ఆలస్యం అవుతుంది.