జనవరి 1 నుంచి మరో కొత్త నిబంధన అమల్లోకి!

Co-driver airbag mandatory for all passenger vehicles manufactured after Jan 1 - Sakshi

జనవరి 1 నుంచి మరో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. 2022 జనవరి 1 నుంచి భారతదేశంలో తయారు చేసే అన్ని ప్యాసింజర్ కార్లలో తప్పనిసరిగా ముందు వరుస సహ ప్రయాణీకుల కోసం కూడా ఎయిర్ బ్యాగ్ ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. డ్రైవరు పక్కన ఉన్న ప్రయాణీకులకు ఎయిర్ బ్యాగ్ ఇన్ స్టాల్ చేసే గడువు తేదీని మరోసారి పొడగించే అవకాశం లేదు అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. జనవరి 1, 2022 నుంచి తయారు చేసే అన్ని ప్యాసింజర్ వేహికల్ మోడల్స్ లలో తప్పనిసరిగా సహ డ్రైవర్ కోసం ఎయిర్ బ్యాగ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారి పేర్కొన్నారు.

ఇంతకు ముందు, ఈ గడువు తేదీని ఆగస్టు 31 నుంచి డిసెంబర్ 31 వరకు వాయిదా వేసింది. ప్రస్తుతం భారతదేశంలో ప్యాసింజర్ వాహనాల్లో డ్రైవర్ ఎయిర్ బ్యాగులు మాత్రమే తప్పనిసరి. ఇటీవల ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం రోడ్డు ప్రమాద బాధితుల్లో భారతదేశంలోనే దాదాపు 10 శాతం మంది ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫెడరల్ ఏజెన్సీ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్(ఎన్‌హెచ్‌టిఎస్‌ఎ) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం..ఎయిర్ బ్యాగులు, సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల ముందు కూర్చొన్న వారిలో మరణించే వారి శాతం 61 శాతం వరకు తగ్గింది. ఎయిర్ బ్యాగు ఉండటం వల్ల మరణాల శాతం 34 శాతం తగ్గినట్లు ఆ నివేదికలో తేలింది.

(చదవండి: భారత్‌లో బిర్యానీతో పాటు ఇది కూడా చాలా ఫేమస్..?)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top