డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ పెంపు | Centre Raises Windfall Tax on Diesel and ATF Exports | Sakshi
Sakshi News home page

డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ పెంపు

Apr 12 2026 12:00 PM | Updated on Apr 12 2026 12:58 PM

Centre Raises Windfall Tax on Diesel and ATF Exports

న్యూఢిల్లీ: డీజిల్, ఏటీఎఫ్‌ ఎగుమతులపై ఆయిల్‌ కంపెనీలకు వచ్చే అసాధారణ లాభాల మీద పన్నులను (విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌) కేంద్రం పెంచింది. దీనితో ఇది డీజిల్‌పై లీటరుకు రూ. 21.50 నుంచి రూ. 55.5కి, విమాన ఇంధనం ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 29.5 నుంచి రూ. 42కి పెరిగింది. ప్రస్తుతం పెట్రోల్‌ ఎగుమతులపై ఎలాంటి సుంకాలు లేవు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ విండ్‌ఫాల్ పన్నులను క్రమపద్ధతిలో సవరిస్తూ వస్తోంది. దేశీయ చమురు ఉత్పత్తిదారులు అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల పొందే అదనపు ప్రయోజనాలను నియంత్రించడమే ఈ పన్ను ప్రధాన ఉద్దేశం. ఈ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం సమకూరడమే కాకుండా, దేశీయ రిఫైనరీలు తమ ఉత్పత్తులను విదేశాలకు తరలించకుండా స్థానిక మార్కెట్ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చేలా చేస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement