
రుణ సంక్షోభంలో చిక్కుకున్న జైప్రకాష్ అసోసియేట్స్(జేపీ) కొనుగోలుకి తాజాగా కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌ను అనుమతించింది. దీంతో దివాలా చట్ట చర్యలలో భాగంగా జేపీని సొంతం చేసుకునేందుకు పీఎన్‌సీ ఇన్‌ఫ్రాకు దారి ఏర్పడనుంది. దివాలా పరిష్కారంకింద దాఖలు చేసిన బిడ్ గెలుపొందే వీలుంది.
తద్వారా జేపీలో కనీసం 95 శాతం, గరిష్టంగా 100 శాతం వాటా కొనుగోలుకి సీసీఐ.. పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్ లేదా భవిష్యత్‌లో పూర్తి అనుబంధ సంస్థగా ఎస్‌పీవీ ఏర్పాటు ద్వారా జేపీలో వాటాను సొంతం చేసుకునేందుకు అనుమతించింది. వెరసి జేప్రకాష్ అసోసియేట్స్ కొనుగోలుకి పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసినట్లు సీసీఐ తాజాగా ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
కాగా.. జేపీ రుణ పరిష్కార ప్రణాళికను ప్రతిపాదించే సంస్థకు సీసీఐ అనుమతి తప్పనిసరంటూ ఐబీసీ నిబంధనల సమీక్ష తదుపరి సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో జేపీ రుణ పరిష్కార ప్రణాళికకు బిడ్ దాఖలు చేసే సంస్థ సీసీఐ నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది.