ఎస్‌బీఐ లైఫ్‌కు స్టోక్‌..కార్లయిల్‌ ఔట్‌

Carlyle Group 1.9percent Stake Share Sold In Sbi Life Insurance - Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ కంపెనీ ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నుంచి పీఈ దిగ్గజం కార్లయిల్‌ గ్రూప్‌ వైదొలగింది. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా 1.9 శాతం వాటాను విక్రయించింది. షేరుకి రూ. 1,130 సగటు ధరలో ఎస్‌బీఐ లైఫ్‌లోగల 1.9 శాతం వాటాను అనుబంధ సంస్థ సీఏ ఎమరాల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ విక్రయించింది. బీఎస్‌ఈ బ్లాక్‌ డీల్‌ గణాంకాల ప్రకారం ఈ వాటా విలువ రూ. 2,147 కోట్లు. 2021 జూన్‌కల్లా ఎస్‌బీఐ లైఫ్‌లో సీఏ ఎమరాల్డ్‌ 1.9 శాతం వాటాను కలిగి ఉంది.

కాగా.. ఈ షేర్లను మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్, మోర్గాన్‌ స్టాన్లీ ఆసియా సింగపూర్, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్, బీఎన్‌పీ పరిబాస్‌ ఆర్బిట్రేజ్‌ తదితరాలతోపాటు. పలు మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ షేరు 1.5 శాతం బలపడి రూ. 1,151 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top