గ్రేట్‌ లెర్నింగ్‌.. ఇకపై బైజూస్‌ ఆధ్వర్యంలో

Byjus Acquires Great Learning E Learning Services firm - Sakshi

ఇండియాలో మోస్ట్‌ పాపులర్‌ ఎడ్యుకేషనల్‌ యాప్‌గా పేరొందిన బైజూస్‌ తన సేవలను మరింతగా విస్తరించనుంది. ఇప్పటి వరకు అకడామిక్‌ ఓరియెంటెండ్‌ సర్వీసెస్‌పై ఎక్కువగా ఫోకస్‌ చేయగా.. రాబోయే రోజుల్లో ప్రొఫెషనల్‌, సర్టిఫికేట్‌ కోర్సులపై కూడా దృష్టి సారించనుంది. అందులో భాగంగా గ్రేట్‌లెర్నింగ్‌ను స్వంతం చేసున్నట్టు ప్రకటించింది.

బిలియన్‌ డాలర్లు
ఉ‍న్నత విద్యకు సంబంధఙంచి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్న గ్రేట్‌ లెర్నింగ్‌ను బైజూస్‌ సొంతం చేసుకోనుంది. సుమారు 600 మిలియన్‌ డాలర్లతో గ్రేట్‌ లెర్నింగ్‌ను కొనుగోలు చేసింది. అంతేకాదు హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌, ప్రొఫెషనల్‌ కోర్సులకు సంబంధించిన సెగ్మెంట్‌లో భారీగా విస్తరించేందుకు మరో 400 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. మొత్తంగా ఉన్నత విద్య, కెరీర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో వన్‌ బిలియన్‌ డాలర్ల పెట్టుబడికి బైజూస్‌ సిద్ధమైంది.

ఇండిపెండెంట్‌గానే
బైజూస్‌ స్వంతం చేసుకున్నప్పటికీ గ్రేట్‌ లెర్నింగ్‌ యాప్‌ను ఇండిపెండెంట్‌గానే కొనసాగనుంది. బైజూస్‌ నేతృత్వంలో గ్రేట్‌ లెర్నింగ్‌ ఫౌండర్‌ మోహన్‌ లక్ష్మణరాజు, కో ఫౌండర్లు హరి నాయర్‌, అర్జున్‌ నాయర్‌లు గ్రేట్‌ లెర్నింగ్‌ను ఇకపై ముందుకు తీసుకెళ్లనున్నారు. పైగా బైజూస్‌ నుంచి భారీగా పెట్టుబడులు రానుండటంతో మరింత సమర్థంగా గ్రేట్‌ లెర్నింగ్‌ను తీర్చిదిద్దనున్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో
ఉ‍న్నత విద్యతో పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రేట్‌ లెర్నింగ్‌ ఆన్‌లైన్‌లో అందిస్తోంది. ఈ యాప్‌కు 15 లక్షల మంది వినియోగదారులు  170 దేశాల్లో ఉన్నారు. గ్రేట్‌లెర్నింగ్‌కి స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, ఎంఐటీ, నేషనల్‌ యూనివర్సిటీ సింగపూర్‌, ఐఐటీ బొంబాయి వంటి ప్రముఖ సంస్థల సహాకారం అందిస్తున్నాయి.

అవకాశాలు సృష్టిస్తాం
గ్రేట్‌ లెర్నింగ్‌ను కొనుగోలు చేయడంపై బైజూస్‌ ఫౌండర్‌, సీఈవో బైజూ రవీంద్రన్‌ స్పందిస్తూ..‘ నేర్చుకోవడం, నేర్చుకోకపోవడం, తిరిగి నేర్చుకోవడం అనేవి ముఖ్యమైన నైపుణ్యాలు. మాకు ఎందులో అయితే ఎక్కడ నైపుణ్యం ఉందో అక్కడ అవకాశాలు సృష్టిస్తాం, కొత్త దారులు వేస్తాం. మాకు ఎక్కడ అనుభవం లేదో కూడా తెలుసు. అక్కడ అనుభవం ఉన్న వారితో అవకాశాలు సృష్టిస్తాం’ అంటూ పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top