
ప్రైవేట్ టెలికం కంపెనీలన్నీ తమ ఎంట్రీ లెవల్ మంత్లీ ప్లాన్‌లను మార్చేశాయి. తక్కువ ధర రీచార్జ్ ప్లాన్‌లను తొలగించాయి. రోజువారీ డేటాతో కూడిన ప్లాన్‌లు కావాలంటే కనీసం రూ.300 ఖర్చు పెట్టాల్సి వస్తోంది. కానీ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే అధిక సేవలను అందించే మరో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను లాంచ్ చేసింది. రూ.200 లోపు మంత్లీ ప్లాన్.. అదీ రోజుకు 2 జీబీ డేటాతో..
ప్రైవేటు సంస్థలకు పెద్ద సవాలు విసురాలనే లక్ష్యంతో బీఎస్‌ఎన్‌ఎల్ ఈ రీఛార్జ్ ప్లాన్ ను లాంచ్ చేసింది. 30 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా, ఉచిత కాలింగ్ అందించే ఈ ప్లాన్ ధర రూ.200 లోపే. ఈ రీఛార్జ్ ప్యాక్ లో బీఎస్‌ఎన్‌ఎల్ అందించే ప్రయోజనాలను వివరంగా చూద్దాం.
బీఎస్ఎన్ఎల్ రూ.199 ప్లాన్‌పై 30 రోజుల ఆకర్షణీయమైన వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా మరో ఆకర్షణ. వీటన్నింటితో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను కూడా అందిస్తుంది. దేశంలోని ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో పోలిస్తే రూ .199 ప్లాన్ ఆర్థిక ప్రయోజనాలు, అధిక ప్రయోజనాలను కలిగి ఉందని పేర్కొంటూ బీఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్యాక్‌ను ప్రవేశపెట్టింది.
ఇదే రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ అందించే ప్లాన్‌కు ఒక ఆపరేటర్ నెలకు రూ.379 వసూలు చేస్తుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. మరో టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అదే సౌకర్యాలతో 28 రోజుల ప్లాన్ కోసం రూ .365 వసూలు చేస్తుంది. మరోవైపు రూ.199 ప్లాన్‌తో మరో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లకు 14 రోజుల వాలిడిటీని మాత్రమే అందిస్తుందని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది.