వొడాఫోన్‌ ఓసీడీల జారీకి చెక్‌, ముగిసిన గడువు  

Break for Vodafone Idea ATC debenture issue proposal - Sakshi

న్యూఢిల్లీ: భారీ రుణ భారాన్ని మోస్తున్న వొడాఫోన్‌ ఐడియా ప్రతిపాదిత ఐచ్చిక మార్పిడిగల డిబెంచర్ల(ఓసీడీలు) జారీకి తాజాగా చెక్‌ పడింది. మొబైల్‌ టవర్ల సంస్థ ఏటీసీ టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ. 1,600 కోట్ల విలువైన ఓసీడీల జారీకి కంపెనీ గతంలో ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించక పోవడంతో ఇందుకు గడువు తిరిపోయినట్లు మొబైల్‌ టెలికం దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా తాజాగా వెల్లడించింది.

వడ్డీబకాయిలను ఈక్విటీగా మార్పు చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లభించలేదని పేర్కొంది. ఏటీసీ టెలికంకు ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో రూ. 1,600 కోట్ల విలువైన ఓసీడీలను జారీ చేసేందుకు గత నెలలో వొడాఫోన్‌ ఐడియా వాటాదారులు అనుమతించారు. అయితే వీటిని 15 రోజుల్లోగా జారీ చేయవలసి ఉన్నట్లు వొడాఫోన్‌ ఐడియా తెలియజేసింది.

అంతకంటే ముందు ప్రభుత్వానికి 16వేల రూపాయల  కోట్ల వడ్డీ(స్పెక్ట్రమ్, ఏజీఆర్‌) బకాయిలకుగాను ఈక్వీటీని జారీ చేయవలసి ఉన్నట్లు వివరించింది. దీంతో ఈ ఒప్పందాన్ని పొడిగించేందుకు ఏటీసీతో చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అవసరానుగుణంగా వాటాదారుల నుంచి మరోసారి అనుమతి తీసుకోనున్నట్లు పేర్కొంది. చెక్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top