
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన తరువాత క్రిప్టో కరెన్సీ మార్కెట్ గణనీయంగా అభివృద్ధి చెందింది. బిట్‌కాయిన్ విలువ అంతకు ముందుకంటే.. కూడా బాగా పెరిగింది. గురువారం ఆసియా వాణిజ్యంలో బిట్‌కాయిన్ వాల్యూ మొదటిసారిగా 124000 డాలర్లకు (రూ. 1,08,68,742) చేరింది. దీనికి యూఎస్ మార్కెట్ సెంటిమెంట్ మాత్రమే కాకుండా.. క్రిప్టోకరెన్సీ రంగానికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు మద్దతునిచ్చాయి.
డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలో ఇటీవల అమెరికాలో జరిగిన నియంత్రణ మార్పులు బిట్‌కాయిన్ పెరుగుదలకు కీలక పాత్ర పోషించాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో బ్యాంకులు క్రిప్టో సంస్థలతో పనిచేయకుండా నిరుత్సాహపరిచిన ఆంక్షలను.. ట్రంప్ ఉపసంహరించుకున్నందున, క్రిప్టో మార్కెట్ అత్యంత అనుకూలమైన ఫండమెంటల్స్‌తో కూడిన కాలాన్ని ఆస్వాదిస్తోంది" ఎక్స్ఎస్.కామ్ సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు 'సమీర్ హాస్న్' పేర్కొన్నారు.
ట్రంప్ మీడియా గ్రూప్ & ఎలాన్ మస్క్ టెస్లా వంటి కంపెనీలు భారీ మొత్తంలో బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేయడంతో.. ఇతర పెట్టుబడిదారులు, సంస్థలు కూడా బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించాయి. ఈ కారణంగా బిట్‌కాయిన్‌కు డిమాండ్ పెరిగింది. ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు బిట్‌కాయిన్ విలువ సుమారు 32 శాతం పెరిగింది. దీంతో నవంబర్ 2024లో 2.5 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న మొత్తం క్రిప్టో మార్కెట్ విలువ.. ఇప్పుడు 4.18 ట్రిలియన్ డాలర్లు దాటింది.
ఇదీ చదవండి: బంగారం కొనడానికి ఇది మంచి తరుణం: ఎందుకంటే?
బిట్‌కాయిన్‌పై రాబర్ట్ కియోసాకి వ్యాఖ్యలు
డబ్బును పొదుపు చేయడం ఉత్తమ పెట్టుబడిదారుల లక్షణం కాదని కియోసాకి పేర్కొన్నారు. బంగారం, వెండి కొనుగోలు చేయాలని సూచించారు. అంతే కాకుండా బిట్‌కాయిన్‌పై ఇన్వెస్ట్ చేస్తే.. పేదవారు కూడా ధనవంతులు అవుతారని, శారీరక శ్రమ లేకుండానే ఆర్థికంగా ఎదుగుతారని పలుమార్లు సూచించారు.