అలర్ట్‌: సెప్టెంబర్‌1 నుంచి అమలులోకి వచ్చిన కీలక మార్పులు!

Big Changes From September 1st That Will Directly Impact Your Finances - Sakshi

వినియోగదారులకు ముఖ్య గమనిక. సెప‍్టెంబర్‌ 1 నుంచి బ్యాంకింగ్‌, ఇన్స్యూరెన్స్‌, టోల్‌ ట్యాక్స్‌, ఇన్స్యూరెన్స్‌, కొత్త ఇళ్ల కొనుగోళ్లు, ఐటీ రిటర్న్‌ వంటి అంశాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా వ్యవహరిస్తే ఆర్ధికంగా తలెత్తే సమస్యల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం ఇవ్వాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన మార్పులేంటో తెలుసుకుందాం? 

ప్రీమియం ధర తగ్గింది
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) మార్చిన నిబంధనల ప్రకారం.. తగ్గిన ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కాబట్టి, పాలసీదారులు..వారి ఏజెంట్‌లకు 20శాతం కమిషన్‌ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. 

గడువు తగ్గింది
ఆగస్టు 1 తర్వాత ఐటీ రిటర్న్స్‌లు దాఖలు చేసిన వారు వెంటనే ఈ-వెరిఫికేషన్‌ పూర్తి చేయాలి. ఎందుకంటే ఆ వెరిఫికేషన్‌ గడువును తగ్గించారు. ఇప్పటి వరకు ఈ గడువు 120 రోజులు ఉండగా.. ఇప్పుడు ఆ గడువును 30రోజులకు తగ్గించారు.  

కేవైసీ పూర్తి చేశారా?
కస్టమర్లు ఆగస్ట్‌ 31 లోగా తమ కేవైసీలను పూర్తి చేయాలని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కోరింది. అయితే గడువులోపు కైవైసీ పూర్తి చేయాలి. లేదంటే బ్యాంక్‌ ఖాతాదారులు వారి అకౌంట్‌లలో లావాదేవీల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది 

వాళ్లు అనర్హులు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై)లో చేరే వారిపై  ఆంక్షలు విధించింది. అక్టోబర్‌ 1నుంచి ఆయాదాపు పన్ను చెల్లింపు దారులు ఈ స్కీమ్‌కు అనర్హులని ప్రకటించింది. అంతకంటే ముందు చేరిన వారు అర్హులని తెలిపింది.

ఇళ్ల ధరలకు రెక్కలు 
తెలుగు రాష్ట్రాల్లో కాదు. సెప్టెంబర్‌ 1 నుంచి ఇళ్ల ధరలు మరింత ఖరీదుగా మారనున్నాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌  గజియాబాద్‌ ల్యాండ్‌ సర్కిల్‌ ధరలు 2 నుంచి 3 శాతానికి పెరిగాయి. రానున్న రోజుల్లో యూపీకి చెందిన ఇతర నగరాల్లో సర్కిల్‌ రేట్లు పెరగనున్నాయి. 

టోల్‌ సర్‌ ఛార్జీల మోత
దేశంలోనే అన్నీ జాతీయ రహదారుల్లో టోల్‌ రేట్లు పెరుగుతున్నాయి. ఆగస్ట్‌ 31 వరకు యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేలో ఉన్న టోల్‌ గేట్‌ సర్‌ ఛార్జీలు కిలో మీటర్‌కు 10పైసలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ సెప్టెంబర్‌ 1 నుంచి ఆ సర్‌ ఛార్జీలు 50పైసలు పెరిగాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top