బెస్ట్ ట్రెండింగ్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ ఇవే!

Best Free Photo Editing Apps For Android and iOS Users, In Telugu - Sakshi

సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఎక్కువ శాతం మంది ఫొటోగ్రఫీ మీద ఆసక్తి చూపుతున్నారు. కొందరు తమ ఫోటోని అందంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత తమ ఫోటోకి ఎన్ని లైక్స్ వచ్చాయి అని చూస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియా వచినప్పటి నుండి ప్రతి ఒక్కరు ఫోటో ఎడిటింగ్ మీద ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. అలాగే కొందరు ఫోటోగ్రఫీ ద్వారా వారు కస్టమర్ దృష్టిని ఆకర్షించి వ్యాపారాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నారు. కొన్ని మంచి యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వాటికీ నెల నెల డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అంతే క్వాలిటీతో కొన్ని ఉచిత యాప్స్ మేము మీకు అందిస్తున్నాం.(చదవండి: 14వేలకే నోకియా 5.4 మొబైల్)

1. స్నాప్‌సీడ్:
ఇది ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. మీ మొబైల్ లో దీని ద్వారా బెస్ట్ ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఉచితంగా లభిస్తున్న బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ లలో ఇది ఒకటి. ఇది గూగుల్ చేత తయారుచేయబడింది. ఇది డెస్క్‌టాప్ ఫోటో ఎడిటర్‌లలో ఉన్న ఫీచర్స్ దీనిలో లభిస్తాయి. అన్ని యాప్స్ మాదిరిగానే ఇందులో ప్రీసెట్ ఫిల్టర్‌లు కూడా లభిస్తాయి. దీనిలో మీరు ఈ ఫిల్టర్‌లను సవరించవచ్చు. క్రాపింగ్, స్ట్రెయిటెనింగ్, ఫ్రేమ్స్, టెక్స్ట్, విగ్నేట్స్ వంటి అన్ని క్లాసిక్ టూల్స్ కూడా ఇందులో ఉన్నాయి. స్నాప్‌సీడ్‌లో ప్రెసిషన్ మాస్కింగ్ ఉంది. దీని ద్వారా మీరు గతంలో ఎడిట్ చేసిన హిస్టరీ కూడా సేవ్ చేసి ఉంటుంది. కాబట్టి మీరు ఏ సమయంలోనైనా తిరిగి ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. 

2. పిక్స్‌లర్: 
50 మిలియన్ డౌన్‌లోడ్‌లతో ప్లే స్టోర్‌లో పిక్స్‌లర్ 4.3 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది మీ స్మార్ట్‌ఫోన్లో 27ఎంబి కంటే తక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది. ఈ యాప్ ఎక్కువ ఎఫెక్ట్స్ ఆడ్ చేసుకోవడంతో పాటు క్రియేటివ్ గా మీ ఫోటోలను ఎడిటింగ్ చేయవచ్చు . ఇందులో ఉన్న ముఖ్యమైన 'ఆటో-ఫిక్స్' ఫీచర్ తో యాప్ లో రంగులను అదే సర్దుబాటు చేసుకుంటుంది. దీని ద్వారా మీరు ఫోటోలను మరింత స్పష్టతతో కూడిన ఫోటోలను మీకు నచ్చినట్లు తయారు చేయవచ్చు. ఇది ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది.

3. విస్కో:
ఇది కూడా ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. దీనిలో అతి ముఖ్యమైన ఫీచర్ వచ్చేసి క్లాసిక్-లుక్ ఫిల్టర్లు. ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగా విస్కో కెమెరా, ఎడిటింగ్ టూల్స్, ఆన్‌లైన్ కమ్యూనిటీ కూడా ఉంది. ఈ ఉచిత ఫోటో యాప్ మీ ఫోటోలను అనలాగ్ ఫిల్మ్ కెమెరాలో తీసినట్లుగా కనిపించే అద్భుతమైన ఫిల్టర్‌ల సెట్ అందిస్తుంది. భారీగా ఫిల్టర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ప్రీసెట్‌లతో పోలిస్తే మీ ఫోటోలకు క్లాస్ టచ్ ఇస్తాయి. మరియు మీరు వీటిని సాధారణ స్లైడర్ ద్వారా కూడా సర్దుబాటు చేయవచ్చు. అన్ని ఫోటో ఎడిటింగ్ యాప్స్ మాదిరిగానే ఇందులో క్రాపింగ్, బార్డర్స్ ఉన్నాయి. ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, టెంపరేచర్ లేదా స్కిన్ టోన్లను సరి చేయడానికి మీరు విస్కోను కూడా ఉపయోగించవచ్చు.

4. ప్రిస్మా ఫోటో ఎడిటర్:
ఇది కూడా ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. దీనిలో అతిముఖ్యమైన ఫీచర్ వచ్చేసి మీ ఫోటోలను కళాత్మకంగా “పెయింటింగ్స్”, “డ్రాయింగ్‌లు” గా మార్చుకోవడం. ఈ ఉచిత ఫోటో ఎడిటింగ్ యాప్ కృత్రిమ న్యూరల్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తుంది. ఇది “పికాసో, మంచ్ లేదా సాల్వడార్ డాలీ చిత్రించినట్లుగా ఫోటోలను ఎడిటింగ్ చేసుకోవచ్చు. దీనిలో 500 కంటే ఎక్కువ సంఖ్యలో క్రియేటివ్ ఫిల్టర్స్ ఉన్నాయి. ప్రిస్మాకు ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే ఆన్‌లైన్ కమ్యూనిటీ కూడా ఉంది. కాబట్టి, మీరు ఎడిటింగ్ పూర్తి చేసిన తర్వాత మీరు మీ చిత్రాన్ని మీ ప్రిస్మా ఫీడ్‌లో షేర్ చేయవచ్చు. 

5. అడోబ్ ఫోటోషాప్ ఎక్స్‌ప్రెస్:
ఇది కూడా ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. దీనిలో అతిముఖ్యమైన ఫీచర్ వచ్చేసి ఆల్‌రౌండ్ ఫోటో ఎడిటింగ్. మీరు లాప్టాప్ లేదా డెస్క్ టాప్ లో ఏ విదంగా ఫోటో ఎడిటింగ్ చేసుకుంటారో అదేవిదంగా ఇందులో చేసుకోవచ్చు. దీనిని మొబైల్ లో సులభంగా ఉపయోగించవచ్చు. ఇందులో అడోబ్ ఫోటోషాప్ లో ఉన్న ఫీచర్స్ అన్ని అందుబాటులో ఉంటాయి.  

6. కాన్వా:
ఇది కూడా ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. దీనిలో అతిముఖ్యమైనది వచ్చేసి వ్యాపారానికి సంబందించిన బ్రాండెడ్ ఫోటోలను సులువుగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. కాన్వా యాప్ బెస్ట్ ఫ్రీ ఎడిటింగ్ యాప్స్ లో ఒకటి. దీనిలో ఫోటో ఎడిటింగ్ మాత్రమే కాదు వెబ్‌సైట్, మార్కెటింగ్ వంటి సంబందించిన ఫోటోలను కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అందుకే  చాలా మల్టీ యూజ్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందులో 50,000 ఫ్రీ టెంపల్ట్స్ ఉన్నాయి. మంచి విజువల్స్ తో పోస్టర్లు తయారుచేయవచ్చు. 

 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top