యాక్సిస్‌ లాభం రూ. 7,129 కోట్లు | Sakshi
Sakshi News home page

యాక్సిస్‌ లాభం రూ. 7,129 కోట్లు

Published Thu, Apr 25 2024 4:42 PM

Axis Bank Net profit at Rs 7,129 crore in Q4 results - Sakshi

క్యూ4లో ఆదాయం రూ. 35,990 కోట్లు

రూ. 1 డివిడెండు

ముంబై: ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 7,129 కోట్ల నికర లాభం ప్రకటించింది. 2022–23 క్యూ4లో బ్యాంకు రూ. 5,728 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. ఇక తాజాగా ఆదాయం రూ. 28,758 కోట్ల నుంచి రూ. 35,990 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 11 శాతం పెరిగి రూ. 13,089 కోట్లుగా నమోదైంది.

మరోవైపు, 2023–24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంకు నికర లాభం 160 శాతం పెరిగి రూ. 24,861 కోట్లకు చేరింది. వ్యాపార పరిమాణం 12% వృద్ధి చెంది రూ. 14,77,209 కోట్లకు ఎగిసింది. గత ఆర్థిక సంవత్సరానికి రూ. 2 ముఖ విలువ గల షేరుపై రూ. 1 చొప్పున డివిడెండ్‌ ఇవ్వాలని బ్యాంకు బోర్డు నిర్ణయించింది.  సిటీ బ్యాంకు వ్యాపార కార్యకలాపాలను అనుసంధానం చేసే ప్రక్రియ వచ్చే ఆరు నెలల్లో పూర్తి కావచ్చని బ్యాంకు సీఈవో అమితాబ్‌ చౌదరి తెలిపారు. భారత్‌లో సిటీబ్యాంక్‌ కన్జూమర్‌ వ్యాపారాన్ని యాక్సిస్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  
బుధవారం బ్యాంకు షేరు బీఎస్‌ఈలో 0.69% పెరిగి రూ. 1,063.70 వద్ద క్లోజయ్యింది.

మరిన్ని విశేషాలు..
► స్థూల మొండి బాకీలు 2.02% నుంచి 1.43 శాతానికి తగ్గాయి.  
► పూర్తి ఆర్థిక సంవత్సరంలో 475, నాలుగో క్వార్టర్లో 125 శాఖలను తెరవడంతో దేశీ యంగా మొత్తం బ్రాంచీల నెట్‌వర్క్‌ 5,377కి చేరింది.
► మార్చి క్వార్టర్‌లో 12.4 లక్షల క్రెడిట్‌ కార్డులను కొత్తగా జారీ చేయడం ద్వారా గత తొమ్మిది క్వార్టర్లలో దేశీయంగా అత్యధిక సంఖ్యలో క్రెడిట్‌ కార్డులను జారీ చేసిన బ్యాంకుల్లో ఒకటిగా బ్యాంక్‌ నిలి్చంది. 

Advertisement
Advertisement