Auto Expo 2023 వాటికి గట్టి పోటీ: మారుతి కొత్త కాంపాక్ట్‌ ఎస్‌యూవీ అదుర్స్‌

Auto Expo 2023 Maruti Suzuki launches Fronx compact SUV - Sakshi

న్యూఢిల్లీ: ఆటో ఎక్స్‌పో 2023లో  రెండో  రోజు దేశీయ ఆటో దిగ్గజం మారుతి సుజుకి కాంపాక్ట్‌ ఎస్‌యూవీని లాంచ్‌ చేసింది.  కాంపాక్ట్‌ ఎస్‌యూవీలకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో  ఫ్రాంక్స్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ, మారుతి సుజుకి జిమ్నీ (5డోర్)ను ఆవిష్కరించింది. వీటి బుకింగ్‌లను కూడా షురూ చేసింది కంపెనీ. కస్టమర్లకు అధునాతన ఫీచర్లు, ఇంజన్ ఎంపికలతో స్పోర్టీ  అండ్‌ స్టైలిష్ వాహనాలను అందించాలని లక్ష్యంతో మారుతి సుజుకి వీటిని లాంచ్‌ చేసింది. ఇది  టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూకి గట్టి పోటీ ఇవ్వనుంది. 

స్పోర్టీ  అండ్‌  స్టైలిష్ డిజైన్‌తో మారుతి సుజుకి ఫ్రాంక్స్
రెండు ఇంజన్ ఎంపికలతో ఇది లాంచ్‌ అయింది. 99 హార్స్‌పవర్, 147 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0 లీటర్ బూస్టర్‌జెట్ ఇంజన్,  89 హార్స్‌పవర్, 113 Nm టార్క్ ఉత్పత్తి చేసే  1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలలో ఇది లభ్యం.కారు  ఫ్రంట్ ఎండ్ ఇటీవల విడుదల చేసిన గ్రాండ్ విటారా, బాలెనో మోడల్‌లు పోలి వుంది. కూపే లాంటి C-పిల్లర్‌ను  LED స్ట్రిప్ , సిగ్నేచర్ LED బ్లాక్ టెయిల్ లైట్లను జోడించింది. 

కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్,ఆరు ఎయిర్‌బ్యాగ్‌లఇతర ఫీచర్లు. అలాగే  5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ , ఏఎంటీమూడు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది.  1.2-లీటర్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ 5 స్పీడ్ ఆటో ట్రాన్స్‌మిషన్ తో వస్తోంది. బూస్టర్ జెట్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటో మేటిక్ ట్రాన్స్‌మిషన్ తో వస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top