ఐఫోన్‌ 17 వచ్చేసింది.. | Apple iPhone 17 Pro Max and 17 Pro and iPhone 17 Launched | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ 17 వచ్చేసింది..

Sep 10 2025 1:49 AM | Updated on Sep 10 2025 1:49 AM

Apple iPhone 17 Pro Max and 17 Pro and iPhone 17 Launched

ధర 799 డాలర్ల నుంచి ప్రారంభం

అత్యంత పల్చని ఐఫోన్‌ 17 ఎయిర్‌ కూడా విడుదల

క్యుపర్టీనో, అమెరికా: టెక్‌ దిగ్గజం యాపిల్‌ తాజాగా ఐఫోన్‌ 17, ఐఫోన్‌ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్‌ ఫోన్లను ఆవిష్కరించింది. ఐఫోన్‌ 17లో 6.3 అంగుళాల స్క్రీన్, ఏ19 ప్రో ప్రాసెసర్, 48 ఎంపీ డ్యుయల్‌ ఫ్యూజన్‌ కెమెరా, 24 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 256 జీబీ మెమొరీ తదితర ఫీచర్లు ఉన్నాయి. అయిదు రంగుల్లో లభిస్తుంది. అత్యంత పల్చని  ఐఫోన్‌ 17 ఎయిర్‌ని కూడా యాపిల్‌ విడుదల చేసింది. దీని మందం 5.6 మిల్లీమీటర్లుగా ఉంటుంది. ఐఫోన్‌ 17 ధర రూ. 799 డాలర్ల నుంచి, ప్రో ధర రూ. 1,099 డాలర్ల నుంచి, ప్రో మ్యాక్స్‌ రేటు 1,199 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది.

ఎయిర్‌ ధర 999 డాలర్ల నుంచి ఉంటుంది.  మంగళవారం క్యుపర్టినోలో జరిగిన కార్యక్రమంలో యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌.. కొత్త ఐఫోన్‌తో పాటు పలు ఉత్పత్తులను ఆవిష్కరించారు. వీటిలో వాచీలు, ఎయిర్‌పాడ్స్‌ ఉన్నాయి. వాచ్‌ ఎస్‌ఈ, వాచ్‌ సిరీస్‌ 11, వాచ్‌ అల్ట్రా 3ని కంపెనీ ఆవిష్కరించింది. వీటి ధరలు వరుసగా 249 డాలర్లు, 399 డాలర్లు, 799 డాలర్లుగా ఉంటాయి. సెపె్టంబర్‌ 19 నుంచి అందుబాటులోకి వస్తాయి. అటు కొత్త ఎయిర్‌పాడ్స్‌ ప్రో3 ధర 249 డాలర్లుగా ఉంటుంది. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 10 గంటలు బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement