Apple: మాకు ఎవరీ సహాయం అక్కర్లేదు..!

Apple To Develop Its Car Alone To Avoid Further Delays - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపై స్పష్టతనిచ్చింది. ఆటోమొబైల్‌ కంపెనీల సహయం లేకుండా ఒంటరిగానే ఎలక్ట్రిక్‌ వాహనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఒక ప్రకటనలో ఆపిల్‌ పేర్కొంది. మెయిల్ ఎకనామిక్ డైలీ కథనం ప్రకారం.. ఆపిల్‌ ప్రస్తుతం వాహన వీడిభాగాల సరఫరా కోసం పలు కంపెనీలు ఎంచుకుంటుందని తెలిసింది.గతంలో ఆపిల్‌ పలు ఆటోమొబైల్‌ దిగ్గజ కంపెనీలు బీఎమ్‌డబ్ల్యూ, హ్యుందాయ్, నిస్సాన్, టయోటాలను సంప్రదించింది. ఉమ్మడిగాగా ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్లాన్‌ చేయడంకోసం ఒప్పందాలను కుదుర్చుకోవాలని భావించింది. 
చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్‌..!

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ భాగంగా ఆపిల్‌ ప్రస్తుతం రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ (ఆర్‌ఎఫ్‌ఐ), రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పి), రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ (ఆర్‌ఎఫ్‌క్యూ) లను గ్లోబల్ ఆటోమొబైల్ పార్ట్ తయారీదారులకు పంపే ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్‌ వాహనాలను రూపోందించడంలో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రొడక్షన్‌, స్టీరింగ్, డైనమిక్స్, సాఫ్ట్‌వేర్,ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో అనుభవం ఉన్న ఇద్దరు మాజీ మెర్సిడెస్ ఇంజనీర్లను ఆపిల్‌  నియమించింది. ప్రస్తుతం వీరు ఆపిల్‌ స్పెషల్‌ ప్రాజెక్ట్‌ గ్రూప్‌లో ప్రొడక్ట్‌ డిజైన్‌ ఇంజనీర్‌లుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ ఆపిల్‌ ఉత్పత్తుల విశ్లేషకుడు మిండ్‌-చికుయో 2025-2027 వరకు ఆపిల్‌ కార్ల విడుదల అవకాశం లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆపిల్‌ కార్ల లాంచ్‌ మరింత ఆలస్యమైనా ఆశ్చర్యపోనవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఆపిల్‌ ఎలక్ట్రిక్‌ కార్ల ప్రాజెక్ట్‌ హెడ్‌ డౌగ్‌ ఫీల్డ్‌ కంపెనీ విడిచిపెట్టి ఫోర్డ్‌ మోటర్స్‌లో చీఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ ఆఫీసర్‌గా జాయిన్‌ కానున్నాడు. దీంతో ఆపిల్‌కు ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ విషయంలో దెబ్బ తగిలినట్లుగా నిపుణుల విశ్లేషిస్తున్నారు. 

చదవండి: Apple : సెప్టెంబర్‌ 14నే ఐఫోన్‌-13 రిలీజ్‌..! కారణం​ అదేనా..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top