Anand Mahindra Isn’t Sure if He Would Stay in This Room With Stunning View - Sakshi
Sakshi News home page

Anand Mahindra: ఆ ప్రదేశం చూడగానే ఆకర్షిస్తుంది.. ఒక రాత్రి అక్కడ ఉండగలనా అంటే!

Jul 13 2023 7:31 PM | Updated on Jul 13 2023 8:04 PM

Anand mahindra viral twitter video Iam not sure i did sign up for a night in this space - Sakshi

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పారిశ్రామిక వేత్త ఎవరు ఆంటే చాలామంది టక్కున చెప్పే సమాధానం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) అని. ఎందుకంటే ఎప్పటికప్పుడు ట్విటర్ వేదికగా చాలా ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఈ వీడియోలో మీరు గమనించినట్లతే ఒక కొండ మీద రూమ్ నిర్మించినట్లు తెలుస్తోంది. కాగా ఇది బయట నుంచి కూడా చాలా పారదర్శకంగా (ట్రాన్స్‌ప‌రెంట్) కనిపిస్తుంది. జోరుగా కురుస్తున్న వాన.. కొండపైన గది.. ఇలాంటి దృశ్యాలు చూస్తే ప్రకృతి ప్రేమికులు పులకరించి పోతారు. అయితే ఆనంద్ మహీంద్రా మాత్రం ఇందులో నేను ఉండగలనా అన్నది సందేహమే అంటూ పోస్ట్ చేశారు.

(ఇదీ చదవండి: ఏసీ రైలు.. ఇండియన్స్‌ను ఎక్కనించేవారే కాదు.. తొలి ఏసీ కోచ్‌ ఎప్పుడు? ఎక్కడ? ఎలా మొదలైందంటే..)

సాధారణంగా నేను ఈ అందమైన డిజైన్‌ను చూసి ఆశ్చర్యపోతుంటాను, కానీ భారీ వర్షం కారణంగా రాత్రి సమయంలో ఇలాంటి గదిలో ఉండగలనా అనేది ఖచ్చితంగా చెప్పలేనని రాస్తూ వీడియో షేర్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. కొంతమంది ఇది చూడటానికి చాలా బాగుంది జీవితంలో ఒక సారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటూ, మరి కొందరు ఇందులో గడపడానికి భయమేస్తుందంటూ వెల్లడించారు.

(ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్‌ రంగాన్నే షేక్‌ చేసిన ఇండియన్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement