
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఊపందుకుంది. పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో ముందుకువస్తున్నాయి. ఇప్పటివరకు భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లే ఎక్కువగా వాహనదారులకు అందుబాటులో ఉన్నాయి. తాజాగా AMO Electric Bikes తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Jaunty Plus ను లాంచ్ చేసింది.
ఫీచర్స్ విషయానికి వస్తే...
Jaunty Plus మోడల్ 60 V/40 Ah అధునాతన లిథియం బ్యాటరీతో పాటు అధిక-పనితీరు గల మోటారుతో పనిచేస్తోంది. ఈ స్కూటర్ లో క్రూయిజ్ కంట్రోల్ స్విచ్, ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (E-ABS), యాంటీ-థెఫ్ట్ అలారం వంటి ఫీచర్స్ తో పాటుగా బలమైన ఛాసిస్‌ను కూడా కలిగి ఉంది. వీటితో పాటుగా టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, హై గ్రౌండ్ క్లియరెన్స్, సైడ్ స్టాండ్ సెన్సార్, సెంట్రల్ లాకింగ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, DRL లైట్స్ , ఇంజిన్ కిల్ స్విచ్ వంటి అదనపు ఫీచర్స్ ఉన్నాయి.
రేంజ్ విషయానికి వస్తే...
జాంటి ఎలక్ట్రిక్ స్కూటర్ను ఒక్క సారి ఛార్జ్ చేస్తే... 120 కిమీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుందని కంపనీ వెల్లడించింది. ఈ బైక్ పూర్తిగా ఛార్జ్ కావడానికి కేవలం నాలుగు గంటల సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది. ఇక రేట్ విషయానికి వస్తే 1,10,460 (ఎక్స్-షోరూమ్)కు రానుంది.AMO ఎలక్ట్రిక్ బైక్‌పై మూడు సంవత్సరాల వారంటీతో వస్తుంది. రెడ్-బ్లాక్, గ్రే-బ్లాక్, బ్లూ-బ్లాక్, వైట్-బ్లాక్, ఎల్లో-బ్లాక్ వంటి ఐదు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 15 నుంచి 140 డీలర్‌షిప్‌లలో ఈ స్కూటర్ అమ్మకాలకు అందుబాటులో ఉంటుంది.