అద్దె రూపంలో భారీగా సంపాదిస్తున్న బచ్చన్ కుటుంబం

Amitabh Bachchan Family To Get Rent Above RS 18 Lakh Per Month - Sakshi

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ముంబైలోని జుహులో గల వారి వత్స, అమ్ము అనే రెండు బంగ్లా గ్రౌండ్ ఫ్లోర్ ను నెలకు రూ.18.9 లక్షల అద్దెతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 15 సంవత్సరాలుకు లీజుకు ఇచ్చినట్లు Zapkey.com పేర్కొంది. ఈ లీజు ఒప్పందాన్ని సెప్టెంబర్ 28, 2021న చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ బంగ్లాలు ప్రస్తుతం బచ్చన్ కుటుంబం నివసిస్తున్న పక్కనే ఉన్నాయి. ఎస్‌బిఐ అద్దెకు తీసుకున్న ఈ ఆస్తి 3,150 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నట్లు Zapkey పేర్కొంటుంది.

అద్దె & డిపాజిట్
డాక్యుమెంట్ ప్రకారం, రెండు బంగ్లాలను నెలకు రూ.18.9 లక్షల అద్దెకు ఇచ్చారు. అలాగే, ప్రతి ఐదు సంవత్సరాలకు 25 శాతం అద్దె పెంచుకునే విధంగా ఒక నిబంధన కూడా చేసుకున్నారు. ఐదేళ్ల తర్వాత అద్దె రూ.23.6 లక్షలు, పదేళ్ల తర్వాత రూ.29.5 లక్షలుగా అద్దె ఉంటుందని డాక్యుమెంట్లు పేర్కొంటున్నాయి. 12 నెలల అద్దెకు సమానమైన రూ.2.26 కోట్ల డిపాజిట్ ను ఇప్పటికే బ్యాంకు చెల్లించినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఎస్‌బిఐ,  అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ స్పందించలేదు. ఈ ప్రాంగణాన్ని ఇంతకు ముందు సిటీ బ్యాంక్‌కు లీజుకు ఇచ్చినట్లు బ్రోకర్లు తెలిపారు.(చదవండి: చైనా కార్లా?.. టెస్లాకు భారత్‌ డెడ్లీవార్నింగ్‌)

హెచ్ఎన్ఐ ప్రాంతం
ఖాతాదారులకు సేవలందించే అనేక బ్యాంకులు హెచ్ఎన్ఐ ప్రాంతంలో ఉన్నాయని స్థానిక బ్రోకర్లు తెలిపారు. ఈ ప్రాంతంలో చాలా మంది ప్రముఖులు, వ్యాపార టైకూన్లు నివసిస్తున్నారు. ఈ ప్రదేశంలో వాణిజ్య అద్దె చదరపు అడుగుకు రూ.450 నుంచి చదరపు అడుగుకు రూ.650 మధ్య ఉంటుంది. స్వతంత్ర బంగ్లాలు కొనాలంటే రూ.100 నుంచి 200 కోట్లు ఖర్చవుతుంది. ఈ ఏడాది మేలో అమితాబ్ బచ్చన్ ముంబైలో టైర్-2 బిల్డర్ క్రిస్టల్ గ్రూప్ అభివృద్ధి చేసిన అట్లాంటిస్ అనే ప్రాజెక్టులో రూ.31 కోట్ల విలువైన 5,184 చదరపు అడుగుల గల ఒక ఇల్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. డిసెంబర్ 2020లో ఈ ఆస్తిని కొనుగోలు చేశారు.(చదవండి: ఎయిర్‌ ఇండియాను దక్కించుకున్న టాటా సన్స్‌)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top