నిరుద్యోగులకు అమెజాన్ తీపికబురు!

Amazon Says Will Hire 55000 People Globally - Sakshi

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 55,000 మందిని నియమించుకోవాలని యోచిస్తున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండీ జాస్సీ రాయిటర్స్ కు తెలిపారు. ఆండీ జాస్సీ జూలైలో అమెజాన్ సీఈఓ పదవీ చేపట్టిన తర్వాత తన మొదటి పత్రికా ఇంటర్వ్యూలో ఇతర వ్యాపారాలతో పాటు రిటైల్, క్లౌడ్ డిమాండ్ ను కొనసాగించడానికి సంస్థకు మరింత మంది అవసరమని చెప్పారు. ప్రాజెక్ట్ కైపర్ అని పిలిచే బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను విస్తృతం చేయడానికి, ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి సంస్థకు చాలా మంది అవసరమని ఆయన అన్నారు.(చదవండి: Amazon: రైతులకు టెక్నికల్‌గా సాయం)

అమెజాన్ వార్షిక జాబ్ ఫెయిర్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. జాస్సీ నియామకాల కోసం ఇది మంచి సమయమని భావిస్తున్నారు. "ఈ మహమ్మారి సమయంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోవడం లేదా మారిన సంగతి తెలిసందే. కొత్త ఉద్యోగాల గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు" అని అన్నారు. మేము తీసుకున్న కెరీర్ డే (https://www.amazoncareerday.com) అనే ఆలోచన సకాలంలో చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని అని అన్నారు. ఈ కొత్త నియామకాలు వల్ల అమెజాన్ టెక్, కార్పొరేట్ సిబ్బంది 20 శాతం పెరగనున్నారు అని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2,75,000 మంది పనిచేస్తున్నారని కంపెనీ తెలిపింది. జాస్సీ ప్రకటించిన 55,000 కు పైగా ఉద్యోగాలలో 40,000 కంటే ఎక్కువ అమెరికాలో ఉంటాయి. మిగిలిన ఉద్యోగాలు భారతదేశం, జర్మనీ, జపాన్ వంటి దేశాలలో ఉన్నాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top