Astro Robot: ఇంటి కాపలా కోసం అదిరిపోయే ఫీచర్లతో వస్తోంది

Amazon Announces Astro Robot With More Features Home Security - Sakshi

ఇంట్లో వాళ్లంతా ఊరెళితే.. కాపలా ఎలా? 24 గంటలూ సీసీ కెమెరాల్లో ఫీడ్‌ చూడలేం.. పెంపుడు కుక్కలు ఉన్నా వాటిని ఇంట్లో వదిలిపెట్టలేం. మరెలా.. అందుకే అమెజాన్‌ సంస్థ ఓ సరికొత్త రోబోను మార్కెట్లోకి తెచ్చింది. దానిపేరు ‘ఆస్ట్రో’. ఈ రోబో ఇల్లంతా తిరుగుతూ కుక్కలా కాపలా కాయడమే కాదు.. మరెన్నో పనులూ చేసిపెడుతుందట. కృత్రిమ మేధ (ఏఐ), అలెక్సా పరిజ్ఞానంతో ఈ రోబో పనిచేస్తుంది. దీనికి తల భాగంలా ఓ స్క్రీన్, దాని వెనుకే యాంటెన్నాలా పైకి, కిందకి కదలగలిగే ప్రత్యేక కెమెరా ఉంటాయి. జస్ట్‌ ఏదైనా ఆదేశం ఇస్తే చాలు.. ఇంట్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్లి పరిశీలిస్తుంది. కావాల్సిన సమాచారం ఇస్తుంది. 

లైవ్‌ వీడియో కూడా.. 
ఆస్ట్రో రోబో ఆస్ట్రో యాప్‌తో అనుసంధానమై ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు నిర్దేశించిన చోటల్లా తిరుగుతూ పరిశీలిస్తుంది. ఎవరైనా వ్యక్తులు, జంతువులు చొరబడినా, ఇతర కదలికలు ఏవైనా ఉన్నా.. వెంటనే తన కెమెరాను ఫోకస్‌ చేసి లైవ్‌ వీడియోను యజమానికి పంపుతుంది. అక్కడి నుంచి ఇచ్చే ఆదేశాలను స్క్రీన్‌పై చూపిస్తుంది, ఆడియోను వినిపిస్తుంది. ఇంతా చేసి ఈ ఆస్ట్రో ధర ఎంతో తెలుసా..? లక్షా ఏడువేల ఐదువందల రూపాయలు. అయితే పరిచయ ఆఫర్‌ కింద రూ.75 వేలకే అందజేస్తామని అమెజాన్‌ చెప్తోంది. ప్రస్తుతానికైతే వీటిని అమెరికా మార్కెట్లో అమ్ముతామని, త్వరలోనే ఇతర దేశాల్లోనూ విడుదల చేస్తామని పేర్కొంటోంది.

చదవండి: ఇక ఫోన్‌ స్క్రీన్‌ పగలదు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top