breaking news
Security at houses
-
‘ఆస్ట్రో’ ది రోబో.. ఇంటి కాపలా కోసం అదిరిపోయే ఫీచర్లతో వస్తోంది
ఇంట్లో వాళ్లంతా ఊరెళితే.. కాపలా ఎలా? 24 గంటలూ సీసీ కెమెరాల్లో ఫీడ్ చూడలేం.. పెంపుడు కుక్కలు ఉన్నా వాటిని ఇంట్లో వదిలిపెట్టలేం. మరెలా.. అందుకే అమెజాన్ సంస్థ ఓ సరికొత్త రోబోను మార్కెట్లోకి తెచ్చింది. దానిపేరు ‘ఆస్ట్రో’. ఈ రోబో ఇల్లంతా తిరుగుతూ కుక్కలా కాపలా కాయడమే కాదు.. మరెన్నో పనులూ చేసిపెడుతుందట. కృత్రిమ మేధ (ఏఐ), అలెక్సా పరిజ్ఞానంతో ఈ రోబో పనిచేస్తుంది. దీనికి తల భాగంలా ఓ స్క్రీన్, దాని వెనుకే యాంటెన్నాలా పైకి, కిందకి కదలగలిగే ప్రత్యేక కెమెరా ఉంటాయి. జస్ట్ ఏదైనా ఆదేశం ఇస్తే చాలు.. ఇంట్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్లి పరిశీలిస్తుంది. కావాల్సిన సమాచారం ఇస్తుంది. లైవ్ వీడియో కూడా.. ఆస్ట్రో రోబో ఆస్ట్రో యాప్‌తో అనుసంధానమై ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు నిర్దేశించిన చోటల్లా తిరుగుతూ పరిశీలిస్తుంది. ఎవరైనా వ్యక్తులు, జంతువులు చొరబడినా, ఇతర కదలికలు ఏవైనా ఉన్నా.. వెంటనే తన కెమెరాను ఫోకస్ చేసి లైవ్ వీడియోను యజమానికి పంపుతుంది. అక్కడి నుంచి ఇచ్చే ఆదేశాలను స్క్రీన్‌పై చూపిస్తుంది, ఆడియోను వినిపిస్తుంది. ఇంతా చేసి ఈ ఆస్ట్రో ధర ఎంతో తెలుసా..? లక్షా ఏడువేల ఐదువందల రూపాయలు. అయితే పరిచయ ఆఫర్ కింద రూ.75 వేలకే అందజేస్తామని అమెజాన్ చెప్తోంది. ప్రస్తుతానికైతే వీటిని అమెరికా మార్కెట్లో అమ్ముతామని, త్వరలోనే ఇతర దేశాల్లోనూ విడుదల చేస్తామని పేర్కొంటోంది. చదవండి: ఇక ఫోన్ స్క్రీన్ పగలదు -
కాంగ్రెస్ నాయకుల ఇళ్ల వద్ద భద్రత పెంపు
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనపై కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల ఇంటివద్ద భద్రత పెంచారు. ఢిల్లీలో గురువారం సాయంత్రం జరుగుతున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణపై జీవోఎంను నివేదికను పరిశీలిస్తున్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రకటించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీమాంధ్రలో భద్రతను పటిష్టం చేశారు. అనంతపురం జిల్లాలో మంత్రి శైలజానాథ్ ఇంటివద్ద భద్రత పెంచారు. పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇక నగరంలో సీఆర్పీఎఫ్ బలగాలు కవాతు నిర్వహించాయి. చిత్తూరు ఎంపీ చింతామోహన్, కేంద్ర మంత్రి జేడీ శీలం, ఎంపీ రాయపాటి సాంబశివరావు సహా...మంత్రులు కన్నా, మాణిక్య వరప్రసాద్, కేంద్రమంత్రి పనబాక, రాష్ట్ర మంత్రి ఆనం, బీజేపీ నేత వెంకయ్యనాయుడుల ఇళ్ల వద్ద భారీ భద్రత ఇంటివద్ద కూడా భద్రతను పెంచారు. ఇదిలా ఉండగా, నాగార్జున యూనివర్సిటీలో భారీ ఎత్తున పోలీస్ బలగాలను మొహరించారు.