ఎయిరిండియా లుక్‌ మారింది.. అదరగొడుతుంది

Air India Unveils New Logo - Sakshi

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ చేతికి చేరిన విమానయాన సంస్థ ఎయిరిండియా సరికొత్త రూపు సంతరించుకుంటోంది. ఇందుకు సంబంధించి కొత్త బ్రాండ్‌ గుర్తింపుని, విమానాల లుక్, లోగోను గురువారం ఆవిష్కరించింది.

ది విస్టా పేరిట తీర్చిదిద్దిన కొత్త లోగో.. అపరిమిత అవకాశాలు, పురోగతి, భవిష్యత్‌పై సాహసోపేత అంచనాలను ప్రతిబింబిస్తుందని కంపెనీ పేర్కొంది. బ్రాండ్స్‌కి ప్రత్యేక రూపునిచ్చే ఫ్యూచర్‌బ్రాండ్‌ కంపెనీతో కలిసి దీన్ని రూపొందించినట్లు వివరించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో వినూత్న హంగులతో ఏ350 విమానం అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి ప్రయాణికులు కొత్త లోగోను చూడవచ్చని ఎయిరిడియా వివరించింది.

మరోవైపు, ఎయిరిండియా అనేది తమకు మరో సాధారణ వ్యాపారంలాంటిది కాదని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. మానవ వనరులతో పాటు ఎయిర్‌లైన్‌ని అన్ని విధాలుగా అప్‌గ్రేడ్‌ చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top