గ్యాస్ కొరతకు చెక్.. 20 శాతం పెరిగిన కేటాయింపు! | Additional 20 Commercial LPG Allocation to States Indian Oil Corp Ltd Tweet | Sakshi
Sakshi News home page

గ్యాస్ కొరతకు చెక్.. 20 శాతం పెరిగిన కేటాయింపు!

Mar 24 2026 8:58 PM | Updated on Mar 24 2026 9:08 PM

Additional 20 Commercial LPG Allocation to States Indian Oil Corp Ltd Tweet

భారతదేశంలో వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు లభ్యతను మరింత బలపరచడానికి ముఖ్యమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది.  ఇందులో భాగంగానే.. దేశవ్యాప్తంగా కమర్షియల్ LPG సరఫరాను పెంచే నిర్ణయం తీసుకుంది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. అదనంగా 20% కమర్షియల్ LPG సిలిండర్ల కేటాయింపును ఆమోదించింది. దీంతో మొత్తం కేటాయింపు సగటు నెలవారీ అవసరంలో 50%కి పెరిగింది. ఈ పెంపు వలన వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరా మరింత స్థిరంగా, సమృద్ధిగా అందుబాటులో ఉంటుంది.

ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సేవలు వంటి రంగాలు గ్యాస్‌ కొరత నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. కాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ సిలిండర్లను సమయానికి, సులభంగా అందేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్ణయం వల్ల వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను అంతరాయం లేకుండా కొనసాగించగలుగుతాయి. అంతేకాకుండా, వినియోగదారులకు ఆహారం, ఇతర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చేస్తుంది. గ్యాస్ కొరత కారణంగా ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయి. ధరల స్థిరత్వం కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement