ఎస్‌ఈసీ కేసు కొట్టేయండి | Adani Group Chief Gautam Adani Seek Dismissal of SEC Lawsuit | Sakshi
Sakshi News home page

ఎస్‌ఈసీ కేసు కొట్టేయండి

Apr 8 2026 8:41 AM | Updated on Apr 8 2026 8:56 AM

Adani Group Chief Gautam Adani Seek Dismissal of SEC Lawsuit

న్యూయార్క్‌ కోర్టులో గౌతమ్‌ అదానీ పిటిషన్‌ 

అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ, ఆయన అల్లుడు సాగర్‌ యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్ఛంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) దాఖలు చేసిన కేసును కొట్టివేయాలంటూ న్యూయార్క్‌ ఈస్ట్రర్న్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో ప్రీమోషన్‌ లెటర్‌ను దాఖలు చేశారు. 2021లో అదానీ గ్రూప్‌ సంస్థ అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ బాండ్ల జారీ ద్వారా అమెరికా ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించింది.

అయితే భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో అధికారులకు లంచాలు ఇచ్చిన సమాచారాన్ని ఇన్వెస్టర్లకు తెలియనీయకుండా తప్పుదోవ పట్టించారంటూ ఎస్‌ఈసీ వీరిపై కేసు దాఖలు చేయడం తెలిసిందే. ఇందులో ఎన్నో లోపాలు ఉన్నాయంటూ.. దేశ సరిహద్దులకు అతీతంగా అమెరికా చట్టాన్ని ఈ కేసు అన్వయిస్తోందని తమ న్యాయవాదుల ద్వారా వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వీడిన యుద్ధ మేఘాలు.. మార్కెట్లలో జోష్‌!

Advertisement
 
Advertisement
Advertisement