ఆధార్ అప్డేట్: జూన్ 14 లాస్ట్ డేట్.. ఇలా చేస్తే అంతా ఫ్రీ

Aadhaar document online update free till 2023 june 14 - Sakshi

ఆధునిక కాలంలో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ అకౌంట్స్ మొదలైన వాటికోసం ఆధార్ తప్పనిసరి అయిపోయింది. కావున ఆధార్ కార్డు వినియోగంలో ఎటువంటి అసౌకర్యం ఎదుర్కోకుండా ఉండాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అప్డేట్ చేసుకోవాలి.

గతంలో ఆధార్ అప్‌డేట్ చేయడానికి రూ. 25 చెల్లించాల్సి ఉండేది, అయితే ప్రస్తుతం 2023 జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ కేవలం myAadhaar పోర్టల్‌లో మాత్రమే ఉచితం. ఇతర ఆధార్ సెంటర్ల వద్ద పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటివి అప్డేట్ చేయాలనుకుంటే రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది.

నిజానికి ఆధార్ అప్డేట్ గడువు ఈ నెల చివరి వరకు మాత్రమే అని తెలిపారు. కాగా ఇప్పుడు ఈ గడువు మూడు నెలలకు పెంచడం జరిగింది. 'యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' ఆధార్ కార్డుని ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేయడానికి అనుమతించింది. కావున మార్చి 15 నుంచి జూన్ 14 వరకు ఆధార్ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి.

(ఇదీ చదవండి: బైక్ ప్రేమికులారా ఊపిరి పీల్చుకోండి.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త బైక్స్ వస్తున్నాయ్)

ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ రెగ్యులేషన్స్, ఆధార్ నంబర్ హోల్డర్‌, ఆధార్ కోసం ఎన్‌రోల్‌మెంట్ చేసిన తేదీ నుండి ప్రతి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అడ్రస్ ప్రూఫ్ (POI) సమర్పించడం ద్వారా కనీసం ఒక్కసారైనా ఆధార్‌లో తమ సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేయవచ్చు. ఇది భవిష్యత్తులో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. ''ఒకవేళా పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ చేయబడిందా.. లేదా అని తెలుసుకోవడానికి, అదే సమయంలో పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలనుకునేవారు'' ఈ లింకుపై క్లిక్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top