UPI Payments: యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..! అయితే వీటిని కచ్చితంగా గుర్తుంచుకోండి..!

5 Things To Keep In Mind While Making UPI Payments - Sakshi

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేజ్‌(యూపీఐ) రాకతో నగదు లావాదేవీలు మరింత సులభంగా మారాయి. బ్యాంకుల ప్రమేయం లేకుండా క్షణాల్లో నగదును ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నాం. పాన్‌ షాపు నుంచి మెడిసిన్స్‌ షాపుల వరకు అందరూ యూపీఐ పేమెంట్స్‌కు అలవాటు పడ్డారు. దీంతో కొత్త సైబర్‌ నేరస్తులు కూడా కొత్త మోసాలకు పాల్పడుతున్నారు.  నకిలీ క్యూ ఆర్‌ కోడ్‌లను, అడ్రస్‌లను యూజర్లకు గాలం వేసి డబ్బులను కాజేస్తున్నారు. ఇలాంటి నేరాల నుంచి తప్పించుకోవాలంటే యూపీఐ పేమెంట్స్‌ విషయంలో పలు సూచనలను పాటిస్తే సురక్షితంగా ఉండవచ్చును. 
చదవండి: హైటెక్‌ ఘరానా మోసగాళ్లు..! నమ్మించి సింపుల్‌గా రూ. 58 వేల కోట్లు స్వాహా..!

1. మీ యూపీఐ చిరునామాను ఎప్పుడూ తెలియనివారితో పంచుకోవద్దు. యూపీఐ చిరునామాను సురక్షితంగా ఉంచడం అత్యంత కీలకమైన భద్రతా చిట్కా.  ఏదైనా చెల్లింపు లేదా బ్యాంక్ అప్లికేషన్ ద్వారా మీ యూపీఐ ఖాతాను యాక్సెస్ చేయడానికి మీరు ఎవరినీ అనుమతించకూడదు.

2. శక్తివంతమైన స్క్రీన్ లాక్‌ని సెట్ చేయండి
మీరు వాడే గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్‌కు శక్తివంతమైన స్క్రీన్‌ లాక్‌ను ఏర్పాటు చేయడం మంచింది. మీ డేట్‌ ఆఫ్‌ బర్త్‌ను, మొబైల్ నంబర్ అంకెలను,  స్క్రీన్‌ లాక్‌గా ఉంచకూడదు.  మీ పిన్‌ను ఎవరితోనూ షేర్ చేయకూడదు ఒకవేళ మీ పిన్ బహిర్గతమైందని మీకు అనుమానం వస్తే, వెంటనే దాన్ని మార్చండి.

3. వేరిఫైకాని లింక్‌లపై క్లిక్ చేయవద్దు, నకిలీ కాల్స్‌ను  హాజరుకావద్దు
సైబర్‌ నేరస్తులు కొంత పుంతలు తొక్కుతూ..యూపీఐ పేమెంట్స్‌ లింక్స్‌ను యూజర్లకు పంపిస్తున్నారు.  యూపీఐ స్కామ్ అనేది యూజర్లను ట్రాప్ చేయడానికి హ్యాకర్లు ఉపయోగించే ఒక సాధారణ టెక్నిక్. హ్యాకర్లు సాధారణంగా లింక్‌లను షేర్‌ చేస్తూ లేదా కాల్ చేసి డబ్బులను ఊడ్చేస్తారు. మీరు అలాంటి లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయకూడదు. మీ పిన్ లేదా మరేదైనా సమాచారాన్ని ఎవరితోనైనా షేర్ చేయకూడదు. బ్యాంకులు ఎప్పుడూ పిన్, ఓటీపీ, మరే ఇతర వ్యక్తిగత వివరాలను అడగవు.

4. ఎక్కువ యాప్స్‌ వాడకండి.
ఆయా యూపీఐ పేమెంట్స్‌ యాప్స్‌ భారీగా ఆఫర్లను ఇస్తున్నాయని చెప్పి ఒకటి, రెండు కంటే ఎక్కువ యూపీఐ యాప్స్‌ వాడడం మంచింది కాదు. 

5. క్రమం తప్పకుండా యాప్స్‌ను అప్‌డేట్ చేయాలి. 
ఆయా యూపీఐ యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ ఉండాలి. కొత్త అప్‌డేట్‌లు మెరుగైన UI , కొత్త ఫీచర్‌లు మీకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. యాప్‌లను తాజా వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేయడంతో మీ యూపీఐ ఖాతాలను సురక్షితంగా ఉంచుతుంది. 

చదవండి: ‘ప్రపంచ బ్లాక్‌ చైయిన్‌ టెక్నాలజీకి క్యాపిటల్‌గా తెలంగాణ..!’

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top