మొబైల్‌ ఫోన్లు ఇక లోకల్‌

11 Lakhs Crore Funds For Smart Phone Manufacturing Units Ravi Shankar Prasad - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా మొబైల్‌ ఫోన్లు, విడిభాగాల తయారీకి దేశ, విదేశీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. భారత్‌తోపాటు తైవాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రియా వంటి దేశాల నుంచి 22 కంపెనీలు తమ ప్రతిపాదనలు సమర్పించాయి. వీటిలో శాంసంగ్, లావా, డిక్సన్, మైక్రో మ్యాక్స్, పెడ్జెట్‌ ఎలక్ట్రానిక్స్‌తోపాటు ఆపిల్‌ ఫోన్లను తయారు చేసే కాంట్రాక్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలు ఫాక్స్‌కాన్, విస్ట్రన్, పెగాట్రాన్‌ ఉన్నాయి. రూ.11,000 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను కంపెనీలు సమర్పించాయని ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. వచ్చే అయిదేళ్లలో రూ.11 లక్షల కోట్ల విలువైన ఫోన్లను ఈ కంపెనీలు తయారు చేస్తాయని కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top