చుంచుపల్లి:ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగూడెం ఆర్టీసీ డిపో నుంచి ఏపీలోని శ్రీకాకుళం, అమలాపురం, నర్సాపురం ప్రాంతాలకు గురువారం నుంచి సూపర్ లగ్జరీ సర్వీసులు ప్రారంభించినట్లు డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మి తెలిపారు. శ్రీకాకుళం సర్వీసు భద్రాచలం నుంచి సాయంత్రం 5:15 గంటలకు మొదలై, కొత్తగూడెంకు 6:30 గంటలకు చేరుతుందని, అక్కడి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉ దయం 6:30కు శ్రీకాకుళం చేరుతుందని వెల్ల డించారు. అలాగే, అమలాపురం సర్వీసు కొత్తగూడెం నుంచి మధ్యాహ్నం 2:15 గంటలకు బయలుదేరి రాత్రి 9:30కు, నర్సాపురం బస్సు కొత్తగూడెం నుంచి మధ్యాహ్నం 3గంటలకు మొదలై రాత్రి 10 గంటలకు చేరుకుంటుందని పేర్కొన్నారు. కాగా, రద్దీ దృష్ట్యా గుంటూరుకు అదనంగా డీలక్స్ సర్వీసులు నడిపిస్తున్నందున ప్రయాణికులు సద్వియోగం చేసుకోవాలి డీఎం సూచించారు.
కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించిన డీఎంహెచ్‌ఓ
పాల్వంచ: పాత పాల్వంచలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థుల కోసం ప్రతిభ, ఆర్‌బీఎస్‌కే బృందం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని గురువారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవలు, కంటి పరీక్షలను సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వస తి గృహంలోని మొత్తం 250 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు పూర్తి చేయగా.. అందులో 8 మందికి దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించామన్నా రు. వారికి మెరుగైన వైద్య పరీక్షలు, ఉచిత చికి త్స అందించాలని ఆదేశించారు. అనంతరం స మతుల్య ఆహారం, పర్యావరణ పరిరక్షణ, ప్లా స్టిక్ వల్ల కలిగే దుష్ప్రాభావాలను వివరించారు.
‘పీఎం మెంటార్‌షిప్’లో ఖమ్మం విద్యార్థి
ఖమ్మం సహకారనగర్: జాతీయ స్థాయిలో యువ, విద్యార్థి రచయితలను ప్రోత్సహించేలా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మెంటార్ షిప్ – 2.0లో ఖమ్మం ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ కాలేజీ విద్యార్థి ప్రతిభ చాటాడు. రెండేళ్ల క్రితం మెంటార్‌షిప్‌నకు ఎంపికై న డిగ్రీ విద్యార్థి మాదాసు ఉదయ్‌కిరణ్ ‘ప్రజాస్వామ్యం, సంస్థలు’ అంశంపై పరిశోధనాత్మక అధ్యయన నివేదిక సమర్పించగా నెలకు రూ.50వేల చొప్పున ఆరు నెలలకు రూ.3లక్షల గౌరవ భృతి అందుకున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా గురువారం అభినందించి మాట్లాడారు. తమ విద్యార్థి పరిశోధన సారాంశాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిందని తెలిపారు. విశ్రాంత తెలుగు అధ్యాపకుడు డాక్టర్ సీతారాం ఉదయ్‌ను ప్రోత్సహించగా, ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు డాక్టర్ రవివర్దన్, డాక్టర్ లక్ష్మణరావు, డాక్టర్ ఎం.పిచ్చయ్య, డాక్టర్ వేణుమాధవ్, డాక్టర్ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరికి తీవ్రగాయాలు
అశ్వారావుపేటరూరల్: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాల చెరువు గ్రామానికి చెందిన కలపాల శ్రీను ద్విచక్రవాహనంపై దమ్మపేట వైపు నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలోని అచ్యుతాపురం క్రాస్ రోడ్ వద్ద అదుపుతప్పి ఆగి ఉన్న లారీను ఢీ కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడగా, స్థానికులు దమ్మపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం రిఫర్ చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.


